Amul's Disclaimer: అమూల్ పాల ఉత్పత్తులపై ఈ రాతలేంటి..? అసలు వీటికి అర్థమేంటి..? నెట్టింట హాట్ టాపిక్..!

ABN , First Publish Date - 2023-03-07T19:28:02+05:30 IST

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి షాప్‌లకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురావడం ఓ మోస్తరు పట్టణాల నుంచి, పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్న వారి దినచర్యలో ఓ భాగం.

Amul's Disclaimer: అమూల్ పాల ఉత్పత్తులపై ఈ రాతలేంటి..? అసలు వీటికి అర్థమేంటి..? నెట్టింట హాట్ టాపిక్..!

ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేచి షాప్‌లకు వెళ్లి పాల ప్యాకెట్ తీసుకురావడం ఓ మోస్తరు పట్టణాల నుంచి, పెద్ద పెద్ద నగరాల్లో నివసిస్తున్న వారి దినచర్యలో ఓ భాగం. స్థానికంగా ప్రాచుర్యం పొందిన లేదా బాగా నమ్మకమైన బ్రాండ్‌కు చెందిన పాల ప్యాకెట్లనే చాలా మంది కొంటుంటారు. మన దేశంలోని చాలా నగరాల్లో అమూల్ (Amul) పాల ఉత్పత్తులను ఎక్కువగా వాడుతుంటారు. అయితే అమూల్ తాజా (Amul Taaza) అనే పాల ప్యాకెట్‌పై రాసి ఉన్న ఓ సూచన (Disclaimer on Amul's milk carton) ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది.

నిజానికి చాలా మంది ప్యాకెట్లపై రాసి ఉన్న వాటి గురించి పట్టించుకోరు. బ్రాండ్ల మీద నమ్మకంతో ఆ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ``అమూల్ తాజా`` పాల ప్యాకెట్‌పై ఉన్న డిస్‌క్లెయిమర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. పాల ప్యాకెట్‌పై అమూల్ తాజా అని ఉన్న కార్టూన్ కింద.. ``తాజా అనేది బ్రాండ్ పేరు లేదా ట్రేడ్ మార్క్ మాత్రమే.. ఇది పాల యొక్క నిజమైన స్వభావాన్ని సూచించదు`` అని రాసి ఉంది. అంటే ``అమూల్ తాజా`` బ్రాండ్ కింద లభించే పాలు తాజావి అని సంస్థ గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఆ వ్యక్తి షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral) అయింది.


వినియోగదారులను ఆకర్షించడానికి బ్రాండ్‌లు (Brands) ఎలా తప్పుదారి పట్టించే పేర్లు పెట్టుకుంటాయో సూచిస్తూ మరికొన్ని ట్వీట్లు చేశారు. ఒక వ్యక్తి ``టాటా గోల్డ్`` (Tata Gold) టీ ప్యాకెట్‌పై కూడా అలాగే రాసి ఉన్న సూచనను కూడా పంచుకున్నారు. బ్రాండ్లు చేస్తున్న మోసాలపై సోషల్ మీడియా వేదికపై ప్రస్తుతం హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-03-07T19:29:57+05:30 IST