#Varisu: అదిదా దిల్ రాజు, సర్ ఎంట్రీ విత్ టు కాఫీ కప్స్

ABN , First Publish Date - 2023-01-17T15:06:53+05:30 IST

దిల్ రాజుని ఈరోజుకి కూడా ఇంకా వదలకుండా ఫుల్ గా ఆడుకుంటున్నారు సాంఘీక మాధ్యమాల్లో.

#Varisu: అదిదా దిల్ రాజు, సర్ ఎంట్రీ విత్ టు కాఫీ కప్స్

తెలుగు నిర్మాత దిల్ రాజుని (Dil Raju) ఇంకా తమిళ్ ప్రేక్షకుల ఆడుకుంటూనే వున్నారు. దిల్ రాజు తమిళంలో తలపతి విజయ్ (#ThalapathyVijay)తో 'వారిసు' (#Varisu)సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కొంచెం యావరేజ్ గానే ఉందని అంటున్నారు తమిళ ప్రేక్షకులు. అదొక్కటే కాదు, దిల్ రాజుని ఈరోజుకి కూడా ఇంకా వదలకుండా ఫుల్ గా ఆడుకుంటున్నారు సాంఘీక మాధ్యమాల్లో. విజయ్ రెండు కప్పుల కాఫీ తో రాగానే దిల్ రాజు మెగా స్టార్, సూపర్ స్టార్ ఎవరూ లేరు, ఒక్క విజయ్ సార్ మాత్రమే సూపర్ అని అనేశాడు. రెండు కప్పుల కాఫీ తో వచ్చిన విజయ్ ఒక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి తప్పితే, మరి దేనికీ రాలేదు. తెలుగు ప్రమోషన్స్ కి కూడా రాలేదు.

అదే దిల్ రాజు మరి ఇంతవరకు తెలుగు స్టార్ లు అందరితో సినిమాలు తీసాడు. మెగా స్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) నుండి చిన్న స్టార్ నిఖిల్ (Nikhil) వరకు అందరూ అన్ని ఫంక్షన్స్ కి వచ్చారు కదా, అన్నిటికీ అటెండ్ అయి సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కదా. మరి తమిళనాడులో ఒక్క ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి తప్ప దేనికీ రాని విజయ్ మన మెగా, సూపర్ స్టార్ ల కన్నా సూపర్ అంటాడు మరి దిల్ రాజు కేవలం రెండు కప్పుల కాఫీ కి. అక్కడ తమిళ ప్రేక్షకులు అందరూ దిల్ రాజు ని, వంశీ పైడిపల్లి ని ట్రోల్ చెయ్యడమే కాకుండా, మెమ్స్ కూడా విపరీతంగా పెట్టారు. (Dil Raju trolled for his comments on Vijay and also about Ajith)

varasudu-new.jpg

డాన్స్ వేణుమా డాన్స్, ఇరుక్కు ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక్కు అంటూ వచ్చి రాణీ తమిళంలో మాట్లాడిన ఈ పదాలు ఇప్పుడు దిల్ రాజు స్టైల్ లో సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మన 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహ రెడ్డి' సినిమాలకి ఏవ్ పదాలు వాడి సినిమాలు ఎలా ఉన్నాయో చెపుతున్నారు తెలుగు వాళ్ళు కూడా. పెద్ద స్టార్ అయినా విజయ్ తో మొదటి సారిగా తమిళ సినిమా లోకి ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజు, సినిమా ఎలా వున్నా, అతని పేరు మాత్రం ఈరోజుకి కూడా మారుమోగుతోంది సాంఘీక మాధ్యమాల్లో. తెలుగు స్టార్ లు అందరూ దిల్ రాజు స్పీచ్ విని, చూసి బాగా నవ్వుకుంటున్నారు అని పరిశ్రమలో అనుకుంటున్నారు.

Updated Date - 2023-01-17T15:06:54+05:30 IST