Share News

December Bank Holidays: డిసెంబర్ నెలలో ఏకంగా 18 రోజుల పాటు సెలవులే.. ఏఏ తేదీల్లో బ్యాంకులు పనిచేయవంటే..!

ABN , First Publish Date - 2023-11-29T13:25:59+05:30 IST

నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాలని అనుకునేవారు ఏ ఏ తేదీల్లో బ్యాంకులు మూతబడతాయో తెలుసుకోవడం ముఖ్యం.

December Bank Holidays: డిసెంబర్ నెలలో ఏకంగా 18 రోజుల పాటు సెలవులే.. ఏఏ తేదీల్లో బ్యాంకులు పనిచేయవంటే..!

బ్యాంకులు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆర్దిక సేవలు అందించడంలో ముందున్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ లో బ్యాంకింగ్ సేవలు విరివిరిగా లభిస్తున్నా చాలా పనులకు నేరుగా బ్యాంకును సందర్శించాల్సి ఉంటుంది. లోన్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పనులు, స్కాలర్షిప్పులు, బ్యాంక్ అకౌంట్లు కొత్తగా నమోదు చేయడం వంటివే కాక ఇతర పనులకు కూడా నేరుగా బ్యాంకును సందర్శించడం ఎంతో ముఖ్యం. కానీ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏకంగా 18రోజుల పాటు మూతబడనున్నాయి. ఇందులో ఆలిండియా బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేస్తున్న సమ్మె తాలూకు సెలవులు కూడా ఉన్నాయి. నేరుగా బ్యాంకులకు వెళ్లి పనులు చక్కబెట్టుకోవాలని అనుకునేవారు ఏ ఏ తేదీల్లో బ్యాంకులు మూతబడతాయో తెలుసుకోవడం ముఖ్యం.

డిసెంబర్ 1వ తేదీ : రాష్ట్ర స్థాపన దినోత్సవం. ఇది అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ బ్యాంకులకు సెలవు దినం.

డిసెంబర్ 3వ తేదీ : ఆదివారం సెలవు.

డిసెంబర్ 4వ తేదీ : సెయింట్ ఫ్రావిన్స్ జేవియర్ పండుగ సెలవు. దీనికారణంగా గోవా బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 9వ తేదీ : రెండవ శనివారం సెలవు.

డిసెబంర్ 10వ తేదీ : ఆదివారం సెలవు.

డిసెంబర్ 12వ తేదీ : పో-టోగన్ నెంగ్మింజా సంగ్మా. దీని కారణంగా మేఘాలయాలో బ్యాంకులు మూతబడతాయి.

Marriage Card: వధూవరులు ఇద్దరూ పీహెచ్‌డీలు చేస్తే ఇలాగే ఉంటుందేమో.. పెళ్లి కార్డును చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!



డిసెబంర్ 13, 14వ తేదీలు: లుసుంగ్/ నామ్ సంగ్. దీని కారణంగా సిక్కింలో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 17వ తేదీ : ఆదివారం సెలవు.

డిసెంబర్ 18వ తేదీ : యు సోసో థామ్ వర్ధంతి, మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 19వ తేదీ : గోవా విమోచన దినం, గోవాలో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 23వ తేదీ : నాల్గవ శనివారం సెలవు.

డిసెంబర్ 24వ తేదీ : ఆదివారం సెలవు.

డిసెంబర్ 25వ తేదీ : (క్రిస్మస్) - అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 26వ తేదీ : క్రిస్మస్ వేడుకలు- మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 27వ తేదీ : క్రిస్మస్ - అరుణాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 30వ తేదీ :U Kiang Nangbah- మేఘాలయలో బ్యాంకులు మూతబడతాయి.

డిసెంబర్ 31వ తేదీ : ఆదివారం సెలవు.

ఇది కూడా చదవండి: Buying Vegetables: వారానికి సరిపడా కూరగాయలను ఒకేసారి కొంటున్నారా..? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయమిది..!


Updated Date - 2023-11-29T13:26:01+05:30 IST