Crime: తల్లిదండ్రులు తిరిగొచ్చేసరికి ఇంట్లో షాకింగ్ సీన్.. నిర్జీవంగా పడి ఉన్న 12 ఏళ్ల కొడుకు.. కూతురిని నిలదీస్తే ఆమె చెప్పింది విని..!

ABN , First Publish Date - 2023-06-01T20:16:31+05:30 IST

ఉదయమంతా ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లాడు సాయంత్రానికి అలా జీవచ్చవంగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ..

Crime: తల్లిదండ్రులు తిరిగొచ్చేసరికి ఇంట్లో షాకింగ్ సీన్.. నిర్జీవంగా పడి ఉన్న 12 ఏళ్ల కొడుకు.. కూతురిని నిలదీస్తే ఆమె చెప్పింది విని..!

ఆ భార్యాభర్తలు ఇద్దరూ ప్రైవేటు ఉద్యోగస్తులు. ఆ దంపతులిద్దరూ తమ పిల్లలను ఇంటి దగ్గరే వదిలి ఎప్పటిలా ఉద్యోగానికి వెళ్ళారు. వారి డ్యూటీ ముగిసిన తరువాత ఇంటికి తిరిగి వస్తోంటే వారున్న వీధిలో ఇంటిముందు జనం కిక్కిరిసి కనిపించారు. 'మన ఇంటి ముందు జనాలున్నారేంటి?' అని కాస్త కంగారుతోనే ఇంట్లోకి వెళ్ళగా 12ఏళ్ళ కొడుకు మంచం మీద విగతజీవిగా కనిపించాడు. ఉదయమంతా ఆడుతూ పాడుతూ కనిపించిన పిల్లాడు సాయంత్రానికి అలా జీవచ్చవంగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు శోకంలో మునిగిపోయారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. ఇంట్లోనే ఉన్న 13ఏళ్ళ కూతుర్ని ప్రశ్నిస్తే షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. అందరినీ విస్తుపోయేలా చేస్తున్న ఈ సంషటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

హర్యానా(Haryana) రాష్ట్రం ఫరీదాబాద్(Faridabad) జిల్లాలో ఉన్న బల్లభ్ గఢ్ అనే టౌన్ లో రాజేంద్రకుమార్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతనికి పెళ్ళయ్యింది. భార్యా భర్తలు ఇద్దరూ ప్రైవేట్ కంపేనీలో ఉద్యోగాలు(couples are private employees) చేస్తున్నారు. వీరికి 12సంవత్సరాల కొడుకు(12years son), 13సంవత్సరాల కూతురు(13 years daughter) ఉన్నారు. ప్రైవేట్ ఉద్యోగాల కారణంగా రాజేంద్ర తన పిల్లలను తన స్వంత గ్రామం అయిన కాకోర్ ఔరయ్యాలో తన తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. వేసవి సెలవుల కోసం పిల్లలిద్దరూ 10రోజుల క్రితం తల్లిదండ్రుల దగ్గకు వచ్చారు. రాజేంద్ర తన భార్యతో కలసి ఎప్పట్లా ఇంటి నుండి ఉద్యోగానికి బయలుదేరాడు. వెళ్ళేముందు పిల్లలకు టైంపాస్ కోసం స్మార్ట్ ఫోన్(father gave smart phone to kids) ఇచ్చి వెళ్ళాడు. సాయంత్రం ఉద్యోగం ముగించుకుని ఇంటికి తిరిగి రాగానే 12ఏళ్ళ కొడుకు మృతదేహం(12years son dead body) మంచం మీద కనిపించింది. కొడుకు మృతితో భార్యాభర్తలిద్దరూ శోకంలో మునిగిపోయారు. కొడుకు గొంతు మీద గుర్తులు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు పిల్లాడి మృతి గురించి ఎలాంటి క్లూ లభించలేదు. ఈ క్రమంలో వారు కుటుంబ సభ్యులందరినీ విచారించారు.

WiFi: ఏం కాదులే అని వైఫై రూటర్ స్విచ్‌ను 24 గంటలూ ఆన్ చేసే ఉంచుతున్నారా..? ఈ నిజాలు తెలిస్తే..!


కుటుంబ సభ్యులందరినీ విచారించిన పోలీసులకు 13ఏళ్ళ కూతురిమీద అనుమానం వచ్చింది. పోలీసులు ఆ పాపను విచారించగా ఆ పాప షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అవ్వ తాతల దగ్గరనుండి తల్లిదండ్రుల వరకు అందరూ పిల్లాడి మీదే ప్రేమచూపిస్తున్నారు తప్ప తనని ప్రేమగా చూడటం లేదని ఆ పాప చెప్పింది. తల్లిదండ్రులు ఉద్యోగానికెళుతూ ఆడుకోవడానికి మొబైల్ ఇచ్చి వెళితే తమ్ముడు ఒక్కడే ఆడుకుంటున్నాడని, తను అడిగినా తనకు మొబైల్ ఇవ్వలేదని ఆ పాప పోలీసుల ముందు చెప్పింది. తనను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారనే బాధ ఒకవైపు ఉంటే.. మరొకవైపు తనకంటే చిన్నవాడైన తమ్ముడు కూడా తనని చులకనగా చూస్తూ తనకు ఆడుకోవడానికి మొబైల్ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహానికి లోనైంది. ఆ కోపంలోనే తమ్ముడిని గొంతుపిసికి చంపేసింది(sister kill brother). ప్రస్తుతం ఈ కేసు గురించి విచారణ జరుపుతున్నారు. చట్టపరమైన ప్రక్రియలు ముగిసిన తరువాత మైనర్ బాలికను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఈ సంఘటన గురించి విన్న ప్రజలు పిల్లల విషయంలో లింగవివక్షత(gender discrimination) చూపించడం చాలా ప్రమాదమని అంటున్నారు.

Crime: వర్షంలో తడవకూడదని సెలూన్ షాపు ముందు నిల్చోవడమే ఆ బాలిక పాలిట శాపమయింది.. స్కూలు నుంచి తిరిగొస్తోంటే..


Updated Date - 2023-06-01T20:16:31+05:30 IST