Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడితే జరిగేదేంటి..? అసలు రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..?

ABN , First Publish Date - 2023-06-06T15:41:12+05:30 IST

ఈ అప్పు కార్డు సహాయంతో షాపింగ్ నుండి ఎన్నో కొనుగోళ్ళు చేయవచ్చు. ఆ తరువాత డబ్బు నెలవారీగా బ్యాంకులలో చెల్లించవచ్చు. అయితే రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉంటే మాత్రం..

Credit Cards: ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడితే జరిగేదేంటి..? అసలు రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉండటం మంచిదేనా..?

ఇప్పట్లో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరా క్రెడిట్ కార్డు ఉంటోంది. కొందరి దగ్గర అయితే ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. ఈ అప్పు కార్డు సహాయంతో షాపింగ్ నుండి ఎన్నో కొనుగోళ్ళు చేయవచ్చు. ఆ తరువాత డబ్బు నెలవారీగా బ్యాంకులలో చెల్లించవచ్చు. అయితే రెండు మూడు క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల ప్రయోజనాలున్నాయా? దీని వల్ల కలిగే లాభనష్టాలేంటి? మొదలైన వివరాలు తెలుసుకుంటే క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్త పడవచ్చు.

క్రెడిట్ కార్డు(credit card) నెలవారీ ఖర్చు పరిమితి విషయంతో పోలిస్తే రెండు క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. నెలవారీ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు క్రెడిట్ కార్డులు ఉంటే ఒక్కోదానిలో కొంచెం చొప్పున రెండు కార్డులు వినియోగించవచ్చు. దీని ద్వారా అవసరాలు తీరడమే కాదు.. కార్డు ద్వారా తక్కువ క్రెడిట్ వినియోగం జరిగి మంచి క్రెడిట్ స్కోర్(credit score) నమోదు అవుతుంది. క్రెడిట్ కార్డులు తీసుకునే ముందే ఏ అవసరానికి తీసుకుంటున్నారో ఆలోచించుకోవడం వల్ల ఎక్కువ లాభం పొందవచ్చు. ఉదాహరణకు లైఫ్ స్టైల్ క్రెడిట్ కార్డు(life style credit card) తీసుకున్నప్పుడు డైనింగ్ మీద భారీ డిస్కౌంట్ ఉంటుంది. కానీ కిరాణా షాపింగ్ చేయాలంటే మాత్రం ఈ కార్డుతో అంత డిస్కౌంట్ ఉండదు. కాబట్టి కార్డ్ ఎంచుకునేటప్పుడు మీరు దేనికోసం ఖర్చు చేయాలని అనుకుంటున్నారో ఆలోచించి దాన్ని దృష్టిలో ఉంచుకుని కార్డు తీసుకోవాలి.

Viral Video: ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను చూస్తే అవాక్కవడం ఖాయం.. ఈ జింక తాపీగా నీళ్లు తాగుతోంటే సడన్‌గా..!


క్రెడిట్ కార్డు తీసుకున్న తరువాత నెలవారీ చెల్లింపులు(monthly payments) ఉంటాయి. దానికి నిర్దేశించిన మొత్తాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉండాలి. లేకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా జరిగితే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డ్ పరిమితికి మించి ఖర్చులు చేస్తే అప్పులో చిక్కుకుపోయే ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు రెండుకు మించి క్రెడిట్ కార్డులు ఉంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆలోచించుకోకుండా క్రెడిట్ కార్డుల జోలికి వెళ్ళకూడదు. క్రెడిట్ కార్డు చెల్లింపు ఖచ్చితంగా నెలవారీ చెల్లించగలమనే నమ్మకం ఉంటేనే కార్డు పొందాలి. ఎంత సంపాద ఉన్నా రెండుకు మించి క్రెడిట్ కార్డులు ఉండటం మంచిది కాదని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. రెండు కార్డుల చెల్లింపు తేదీలు కూడా దగ్గరగా ఉంటేనే మంచిది, రెండు చెల్లింపులు ఒకేసారి చేయవచ్చు. లాభం కోసం అప్పు కార్డు తీసుకుని అప్పులో కూరుకుపోకూడదంటే క్రెడిట్ కార్డుల గురించి అవగాహన చాలా అవసరం.

ATM Card: ఏటీఎం కార్డులపై కనిపించే 16 అంకెల సంఖ్యకు అర్థమేంటి..? 16వ స్థానంలో ఉండే అంకెతో అసలేం తెలుస్తుందంటే..!


Updated Date - 2023-06-06T15:41:12+05:30 IST