Close To Flight Fare: బెంగళూరు వాసులను బెంబేలెత్తిస్తున్న ప్రైవేట్ క్యాబ్ ధరలు !

ABN , First Publish Date - 2023-05-26T18:43:49+05:30 IST

సిలికాన్ సిటీ బెంగళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లాలనుకున్న ఓ యూజర్ ఉబర్ క్యాబ్ ధరలను చూసి షాక్ అయ్యాడు.

Close To Flight Fare: బెంగళూరు వాసులను బెంబేలెత్తిస్తున్న ప్రైవేట్ క్యాబ్ ధరలు !

సిలికాన్ సిటీ బెంగళూరు(Bengaluru)లో ట్రాఫిక్(Traffic), గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌ల గురించి మనకు తెలిసిందే. ట్రాఫిక్ ఓ పీడకల అని ప్రజారవాణా వ్యవస్థ గురించి సోషల్ మీడియాలో నెటిజన్లు షేర్ చేయని రోజంటూ లేదు. దీంతో చాలామంది ప్రైవేట్ క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. ఓలా, ఉబర్ వంటి క్యాబ్ అగ్రిగేటర్లపై ఆధారపడతారు.ఇటీవల ఎయిర్‌పోర్ట్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్లాలనుకున్న ఓ యూజర్ ఉబర్ క్యాబ్ ధరలను చూసి షాక్ అయ్యాడు.

ఉబర్ క్యాబ్ ధరలు(Uber Cab Price) చూసి ఆ వ్యక్తి ఇలా స్పందించాడు. "ఈ-సిటీ(Electronic City) నుంచి బెంగుళూరు విమానాశ్రయానికి(Bengaluru Airport) ఉబెర్ ఛార్జీలు, క్యాబ్ ఛార్జీలు నేను విమాన టిక్కెట్ కోసం చెల్లించిన దానికి చాలా దగ్గరగా ఉన్నాయి" అని రాశాడు. అతను Uber ధరల స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. 52కిమీ దూరానికి Uber ప్రీమియం ధర రూ.2,584 అయితే Uber XL ధర రూ.4,051.

ఇంటర్నెట్‌లో ఉబర్ క్యాబ్ ధరలు(Cab Price) చాలా మందిని షాక్‌కు గురి చేశాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్ట్‌కి షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 80వేలమంది చూశారు. 740 లైక్‌లు వచ్చాయి. ఈ పోస్ట్‌పై స్పందించిన ఓ నెటిజన్ "మొదట వారు మమ్మల్ని దానికి బానిసలుగా చేశారు.తర్వాత దోచుకోవడం ప్రారంభించారు" అని పేర్కొన్నాడు.

Updated Date - 2023-05-26T18:52:31+05:30 IST