MegaStarChiranjeevi: అప్పటి శుభలేఖ ఇప్పుడు వైరల్

ABN , First Publish Date - 2023-02-20T12:18:51+05:30 IST

మెగాస్టార్ చిరంజీవికి (#MegaStarChiranjeevi) సురేఖ (Surekha) గారితో వివాహం అయ్యి ఈరోజుకి 43 ఏళ్ళు అయింది. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం అంటే, 1980, ఫిబ్రవరి 20 వ తేదీన చిరంజీవి కి, సురేఖకు చెన్నైలోని రాజేశ్వరి కల్యాణ మండపం లో వివాహం జరిగింది.

MegaStarChiranjeevi: అప్పటి శుభలేఖ ఇప్పుడు వైరల్

మెగాస్టార్ చిరంజీవికి (#MegaStarChiranjeevi) సురేఖ (Surekha) గారితో వివాహం అయ్యి ఈరోజుకి 43 ఏళ్ళు అయింది. సరిగ్గా 43 ఏళ్ళ క్రితం అంటే, 1980, ఫిబ్రవరి 20 వ తేదీన చిరంజీవి కి, సురేఖకు చెన్నైలోని రాజేశ్వరి కల్యాణ మండపం లో వివాహం జరిగింది. సురేఖ ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్యగారి (Allu Ramalingaiah) కుమార్తె, అలాగే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) గారి కి సిస్టర్. చిరంజీవి, సురేఖలకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు అతనే అగ్ర నటుల్లో ఒకరు అయిన రామ్ చరణ్ (Ram Charan).

chiru-wed1.jpg

ఈరోజు ఫిబ్రవరి 20, చిరంజీవి గారి వివాహ మహోత్సవ రోజు కాబట్టి, అతనికి సాంఘిక మాధ్యమాల్లో అందరూ విష్ చేస్తున్నారు. అలాగే అతని వివాహ మహోత్సవ పత్రిక, శుభలేఖ (Chiranjeevi wedding card), అప్పటిది ఇప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిరంజీవి 'ప్రాణం ఖరీదు' (Pranam Khareedu) అనే సినిమా ద్వారా తెలుగు చలన చిత్రసీమలోకి అడుగు పెట్టారు. కానీ ముందుగా ఒప్పుకున్న సినిమా మాత్రం 'పునాదిరాళ్ళు' (Punadiraallu). ఆ సినిమా కొంచెం ఆలస్యం అవటం వలన ఈ 'ప్రాణం ఖరీదు' ముందుగా విడుదల అయింది. (#ChiranjeeviWeddingAnniversary) ఇది 1978 వ సంవత్సరం లో. అప్పటికే చిరంజీవి గురించి, అతని కష్టపడే మనస్తత్వం, ఇంకా అతని గురించి మంచి మాటలు విన్న అల్లు రామలింగయ్య గారు ఇతన్ని అల్లుడిగా చేసుకుంటే బాగుంటుంది అని తన కూతురు సురేఖ తో 1980 లో వివాహం జరిపించారు.

chiru-wed.jpg

ఇంతింత అయి, వటుడింత అయి అన్న చందాన, చిరంజీవి గారు చిన్నగా కెరీర్ ప్రారంభించి అనతి కాలం లోనే స్టార్ స్థాయికి ఎదిగి, ఆ తరువాత మెగాస్టార్ అయ్యారు. ఎవరూ ఎదగలేనంత ఎత్తుకు ఎదిగి, ఈరోజు సినిమా పరిశ్రమలో చిరంజీవి అనే వటవృక్షాన్ని స్థాపించారు. అతని నీడలో, అంటే మెగా ఫామిలీ (Mega Family) నుండి ఈరోజు చాలామంది నటులు సినిమా పరిశ్రమలో వున్నారు. అటువంటి చిరంజీవి గారికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు. (WeddingAnniversary)

Updated Date - 2023-02-20T12:18:52+05:30 IST