Chennai: సెంట్రల్లో రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌

ABN , First Publish Date - 2023-08-31T10:25:27+05:30 IST

డాక్టర్‌ ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌(Dr. Mgr Central Railway Station) పక్కనే కొత్తగా ‘రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌’ ఏర్పాటైంది.

Chennai: సెంట్రల్లో రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌

చెన్నై, (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ ఎంజీఆర్‌ సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌(Dr. Mgr Central Railway Station) పక్కనే కొత్తగా ‘రైల్‌ కోచ్‌ రెస్టారెంట్‌’ ఏర్పాటైంది. డైన్‌ ఇన్‌ రెస్టారెంట్‌ పేరుతో రైలు బోగీ(Train bogie)లో ఏర్పాటైన ఈ ఆహారశాలకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అచ్చు రైలు బోగీలో కూర్చుని తినే అనుభూతితో పాటు రుచికరమైన ప్రత్యేక వంటకాలతో ఆహారప్రియులను ఇట్టే కట్టిపడేస్తోంది. ఈ బోగీలో రెండేళ్లపాటు ఆహారశాల ఏర్పాటు చేసేందుకు రూ.2.2 కోట్లతో ఓ ప్రైవేటు సంస్థ టెండర్‌ దక్కించుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 24 గంటలూ ఈ హోటల్‌ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం బోగీలో 40 మంది, బయట 110 మంది కూర్చునే వీలుగా ఏర్పాట్లు చేపట్టారు. ఆహార పంపిణీకి 26 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉండగా మునుముందు ఇలాంటి రైల్‌ కోచ్‌ రెస్టారెంట్లు మరిన్ని ఏర్పాటు కానున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. పొత్తేరి, పెరంబూర్‌, కాట్టాన్‌కొళత్తూర్‌ రైల్వేస్టేషన్లలో కూడా ఇలాంటి ఆహారశాలలు ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని వారు తెలిపారు.

nani10.jpg

nani10.3.jpg

Updated Date - 2023-08-31T10:25:29+05:30 IST