Chennai: ఎమ్మెల్యే బర్త్‌డే.. పారిశుధ్య కార్మికులకు ‘స్టార్’ విందు
ABN , First Publish Date - 2023-03-18T13:16:16+05:30 IST
పుదుచ్చేరిలోని ముదలియార్‌పేట డీఎంకే ఎమ్మెల్యే సంపత్(DMK MLA Sampath) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. ఆ సంద

అడయార్(చెన్నై): పుదుచ్చేరిలోని ముదలియార్‌పేట డీఎంకే ఎమ్మెల్యే సంపత్(DMK MLA Sampath) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం జరుపుకున్నారు. ఆ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు పుష్టిగా భోజనం పెట్టారు. అదీకూడా సాదాసీదా హోటల్‌లో కాదు. స్టార్ హోట్‌లో ఆయన విందు భోజనం ఏర్పాటు చేయగా, అనేక మంది పారిశుధ్య కార్మికులు వచ్చారు. వీరికి ఎమ్మెల్యే స్వయంగా ప్లేట్లు అందించారు. దీంతో ఎంతో సంతోషానికి గురైన కార్మికులు కడుపునిండా భోజనం ఆరగించి, ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, ఎమ్మెల్యే కూడా కార్మికులతో కలిసి భోజనం చేశారు.