Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ

ABN , First Publish Date - 2023-10-08T17:32:32+05:30 IST

తన స్నేహితుడికి రూ.2 వేలు ట్రాన్స్‌ఫర్ చేసిన ఓ వ్యక్తి అకౌంట్లో మరుసటి రోజు ఏకంగా రూ.753 కోట్లు బదిలీ అయ్యాయి. అయితే, ఆ వ్యక్తి వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వారు అతడి అకౌంట్‌ను తాత్కాలికంగా స్తంభింపజేశారు. చెన్నైలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: స్నేహితుడికి రూ.2 వేలు బదిలీ చేశాక షాకింగ్ మెసేజ్.. అకౌంట్లో ఏకంగా రూ.753 కోట్లు జమ

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య కాలంలో బ్యాంక్ అకౌంట్లో అకస్మాత్తుగా కోట్లకు కోట్లు జమ అవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా సామాన్యుల అకౌంట్ల విషయంలోనే ఇలా జరుగుతుండటంతో వారు ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆ డబ్బులు డ్రా చేసుకుని చిక్కుల్లో పడుతుంటే మరికొందరు బాధ్యతాయుత వైఖరితో విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళుతున్నారు. ఇటీవల తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులో అకౌంట్ ఉన్న ఓ వ్యక్తికి పొరపాటును రూ.9 వేల కోట్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది(Chennai man transfers Rs 2,000 to friend, finds Rs 753 crore in own account). ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..


చెన్నైకి చెందిన మహ్మద్ ఇడ్రిస్ స్థానికంగా ఓ మెడికల్ షాపులో పనిచేస్తుంటారు. శుక్రవారం ఆయన తన కోటక్ మహీంద్రా బ్యాంక్‌ అకౌంట్లో్ంచి స్నేహితుడికి రూ.2000 వేలు ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ ఆ మరుసటి రోజు ఆయన అకౌంట్లోకి ఏకంగా రూ.753 కోట్లు జమ అయ్యింది. ఈ మేరకు వచ్చిన ఎస్‌ఎమ్ఎస్ చూసుకుని ఆయన దిమ్మతిరిగినంత పనైంది.

Metro: మెట్రోలో ఇలా మాత్రం చేయకండి! వీడియో వైరల్ అయిందని యువకుడు సంతోషించే లోపే భారీ షాక్!

ఏదో తేడా జరిగిందని అనుమానించిన ఆయన వెంటనే బ్యాంకు వారికి సమాచారం అందించారు. దీంతో, అధికారులు ఆయన అకౌంట్‌ను తాత్కాలికంగా స్తంభింపజేశారు.

కాగా, తమిళనాడు ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి. గతంలో ఓ క్యాబ్ డ్రైవర్ అకౌంట్లోకి ఏకంగా రూ.9 వేల కోట్లు బదిలీకాగా అంతకుమునుపు తంజావూర్‌కు చెందిన గణేశన్ అనే వ్యక్తి అకౌంట్లో అకస్మాత్తుగా రూ.756 కోట్లు వచ్చి చేరాయి.

Updated Date - 2023-10-08T17:32:36+05:30 IST