Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..

ABN , First Publish Date - 2023-10-06T22:11:11+05:30 IST

స్కూటీ మీంచి కిందపడ్డ యువతులకు సాయం చేసేందుకు వచ్చాడో వ్యక్తి. వారి స్కూటీని పైకి లేపే ప్రయత్నంలో యాక్సెలరేటర్‌పై చేయి వేయడంతో దూసుకుపోయిన స్కూటీ వెళ్లి నీళ్లల్లో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: స్కూటీపై వెళుతూ కింద పడ్డ యువతులు..సాయం చేస్తానంటూ వచ్చి ఓ అపరిచితుడు చేసిన పనికి..

ఇంటర్నెట్ డెస్క్: ఇబ్బందుల్లో పడ్డ వాళ్లకు సాయం చేయాలనుకోవడం మంచిదే కానీ వాళ్ల సమస్యలు రెట్టింపు అయితే మాత్రం చిక్కుల్లో పడ్డట్టే. ఇలా ఉపకారం చేయబోయి అపకారం తలపెట్టిన ఓ వ్యక్తి వీడియో నెట్టింట్లో వైరల్‌గా(Viral Video) మారింది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువతలు బండిని ఆపబోయి అకస్మాత్తుగా కిందపడిపోయారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వారిని చూసి సాయం చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే యువతలు ఇద్దరూ లేచి నిలబడటంతో కిందపడి ఉన్న స్కూటీని లేవనెత్తే ప్రయత్నం చేశాడు. బండిని లేపే క్రమంలో యాక్సెలరేటర్ మీద చేయి వేయడంతో బైక్ వేగం పుంజుకుని రోడ్డు పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి కూడా నీళ్లల్లో పడిపోయాడు. ఖరీదైన స్కూటీ వెళ్లి నీళ్లల్లో పడిపోవడంతో యువతులు లబోదిబోమంటూ నెత్తిబాదుకున్నారు(Man accidentally drivers girls scooty into water).

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి జనాలు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇదేం సాయం నాయనా.. యువతులు నెత్తికి చేతులు తెచ్చావే అంటూ కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు తొమ్మిది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Updated Date - 2023-10-06T22:15:41+05:30 IST