Chennai: సేలం నుంచి షిర్డీ వరకు.. 82 ఏళ్ల వయస్సులోనూ..

ABN , First Publish Date - 2023-03-30T12:14:55+05:30 IST

సేలంకు చెందిన సాయిబాబా భక్తుడు కనక సభాపతి(82) మౌంటైన్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ నిర్వాహకుడు. 30 ఏళ్లుగా తన కార్యకలాపాలకు సైకిల్‌

Chennai: సేలం నుంచి షిర్డీ వరకు.. 82 ఏళ్ల వయస్సులోనూ..

పెరంబూర్‌(చెన్నై): సేలంకు చెందిన సాయిబాబా భక్తుడు కనక సభాపతి(82) మౌంటైన్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ నిర్వాహకుడు. 30 ఏళ్లుగా తన కార్యకలాపాలకు సైకిల్‌ వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన సేలం నుంచి షిర్డీ(Salem to Shirdi)కి సైకిల్‌పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 16వ తేది సైకిల్‌ యాత్ర ప్రారంభించిన కనక సభాపతి, పలు రాష్ట్రాల మీదుగా ఈ నెల 22వ తేది షిర్డీ చేరుకున్నారు. ఈ యాత్రలో ఆయన 1,207 కి.మీ సైకిల్‌ ప్రయాణం చేశారు. తన యాత్ర పూర్తిచేసుకొని మంగళవారం స్వగ్రామానికి చేరుకున్న ఆయనకు పట్టణ ప్రముఖులు, పలు సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనక సభాపతి మాట్లాడుతూ... సైకిల్‌ తొక్కితే ఆరోగ్యంతో పాటు మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. ప్రస్తుతం సైకిల్‌ వినియోగం అధికం కావడం శుభపరిణామమని, ఆరోగ్యవంతమైన జీవితానికి సైక్లింగ్‌ ముఖ్యమని కనక సభాపతి తెలిపారు.

Updated Date - 2023-03-30T12:14:55+05:30 IST