Chennai: పాత్రలో చిక్కుకున్న బాలుడి తల

ABN , First Publish Date - 2023-08-02T09:02:12+05:30 IST

స్టీల్‌ పాత్రలో చిక్కుకున్న బాలుడి తలను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యం గా తీశారు. తిరునల్వేలి జిల్లా గంగైకొండాన్‌ సమీపం

Chennai: పాత్రలో చిక్కుకున్న బాలుడి తల

- రక్షించిన అగ్నిమాపక సిబ్బంది

పెరంబూర్‌(చెన్నై): స్టీల్‌ పాత్రలో చిక్కుకున్న బాలుడి తలను అగ్నిమాపక సిబ్బంది చాకచక్యం గా తీశారు. తిరునల్వేలి జిల్లా గంగైకొండాన్‌ సమీపం అన్నాతలైయూర్‌కు చెందిన మైఖేల్‌రాజ్‌ కుమారుడు జేవియర్‌ (4) సోమవారం రాత్రి ఇంట్లోని పాత్రలతో ఆడుకుంటున్న సమయంలో, హఠాత్తుగా పాత్రలో తల చిక్కుకుపోయింది. గమనించిన తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారు పాత్ర తీసేందుకు చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో, 108 అంబులెన్స్‌ ద్వారా బాలుడిని తిరునల్వేలి ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సమాచారంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక పరికరం ద్వారా పాత్రను కట్‌ చేసి బాలుడి తలకు విముక్తి కల్పించారు. అనంతరం బాలుడికి వైద్యం చేసి ఇంటికి పంపారు.

Updated Date - 2023-08-02T09:02:12+05:30 IST