మనిషి కాంతివేగంతో ప్రయాణించడం సాధ్యమేనా? ఒకవేళ అదే జరిగితే ఏమవుతుందంటే...

ABN , First Publish Date - 2023-04-12T12:27:29+05:30 IST

కాంతివేగం(speed of light) అన్నింటికన్నా అత్యధికమనే విషయం అందరికీ తెలిసింది. మనిషి కాంతివేగంతో పోటీపడగలడా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మనిషి కాంతివేగంతో ప్రయాణించడం సాధ్యమేనా? ఒకవేళ అదే జరిగితే ఏమవుతుందంటే...

కాంతివేగం(speed of light) అన్నింటికన్నా అత్యధికమనే విషయం అందరికీ తెలిసింది. మనిషి కాంతివేగంతో పోటీపడగలడా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిజానికి మనిషి కాంతి వేగంతో పయనించడం అనేది కేవలం ఒక ఫాంటసీ(Fantasy) మాత్రమే. అది అసాధ్యం. ద్రవ్యరాశి ఉన్న ప్రతివస్తువు కదలడానికి శక్తి అవసరం. ఐన్‌స్టీన్ సిద్ధాంతం(Einstein's theory) ప్రకారం ద్రవ్యరాశి కలిగిన ఏ వస్తువు కూడా కాంతి వేగానికి మించి ఎక్కువ వేగంతో వెళ్లలేదు.

ఎందుకంటే ఆ వేగం అందుకునేందుకు ఆయా వస్తు ద్రవ్యరాశి(Mass) అనంతంగా ఉండాలి. దానిని వేగవంతం చేయడానికి అనంతమైన శక్తి కూడా అవసరం, సైన్స్ ABC వెబ్‌సైట్ నివేదిక ప్రకారం ఎవరైనా కాంతివేగంలోని 90 శాతం మేరకు పోటీపడుతూ ప్రయాణిస్తే.. భూమి నుండి అంగారక గ్రహానికి(Mars) గల 45 కోట్ల కిలోమీటర్ల ప్రయాణాన్ని రానుపోను కలుపుకుని దాదాపు 16 నిమిషాల 40 సెకన్లలో పూర్తి చేయగలుగుతారు. ఉదాహరణకు మీరు కాంతి వేగంలోని 99.99 శాతంతో ప్రయాణిస్తే సౌర వ్యవస్థ(solar system)కు వెలుపల 4.35 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మూడు నక్షత్రాల సమూహమైన ఆల్ఫా సెంటారీ(Alpha Centauri)కి చేరుకునేందుకు 8 సంవత్సరాలు పడుతుంది.

Updated Date - 2023-04-12T12:34:42+05:30 IST