అక్కతో సంబంధం ఖాయం చేసుకున్నారు.. కానీ పెళ్లి జరిగింది మాత్రం చెల్లితో.. వివాహం జరిగిన మర్నాడే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-02-13T16:20:28+05:30 IST

ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది.. బంధుమిత్రులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకుంది.. వరుడితో కలిసి పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంది.. వరమాల వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి గదిలోకి వెళ్లింది.. ఎంతసేపటికీ రాలేదు..

అక్కతో సంబంధం ఖాయం చేసుకున్నారు.. కానీ పెళ్లి జరిగింది మాత్రం చెల్లితో.. వివాహం జరిగిన మర్నాడే షాకింగ్ ట్విస్ట్..!

ఆ యువతికి పెళ్లి నిశ్చయమైంది.. బంధుమిత్రులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకుంది.. వరుడితో కలిసి పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంది.. వరమాల వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి గదిలోకి వెళ్లింది.. ఎంతసేపటికీ రాలేదు.. గదిలోకి వెళ్లి చూస్తే ఎక్కడా ఆమె కనిపించలేదు.. షాకైన తల్లిదండ్రులు కుటుంబ పరువు పోకూడదనే ఉద్దేశంతో వరుడికి తమ చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు.. తర్వాతి రోజు ఉదయం అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు (Bride found missing from wedding).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఖుషీనగర్‌కు చెందిన ఉదయనాథ్ కుమార్తె నీతుకు ఆదివారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఆ రోజు ఇరు కుటుంబాల వారు బంధుమిత్రులతో కలిసి కల్యాణ మండపానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు జరిగిన పెళ్లి తంతులో నీతు ఆనందంగానే పాల్గొంది. వరమాల కార్యక్రమానికి ముందు బాత్రూమ్‌కు వెళ్లొస్తానని చెప్పి గదిలోకి వెళ్లింది. ముహూర్తం దగ్గరపడుతున్నా నీతూ బయటకు రాలేదు. గదిలోకి వెళ్లి చూస్తే ఎక్కడా ఆమె కనిపించలేదు. నీతూ ఎవరితోనో వెళ్లిపోయిందని భావించిన తల్లిదండ్రులు కుటుంబ పరువు పోకూడదనే ఉద్దేశంతో వరుడికి తమ చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు.

పెళ్లి మండపం వరకు వచ్చి.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి వెనక్కి వెళ్లిపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..

తర్వాతి రోజు ఉదయం గ్రామ శివారులో ఉన్న ఓ చెట్టుకు నీతూ మృతదేహం వేలాడుతూ కనిపించింది (Bride found hanging). పెళ్లి దుస్తుల్లోనే నీతూ ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నీతూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. పోస్ట్‌మార్టమ్ రిపోర్టు వచ్చిన తర్వాతనే నీతూది హత్యా? ఆత్మహత్యా? అనేది తెలుస్తుందని, దానిని బట్టి ఈ కేసులో ముందుకెళ్తామని పోలీసులు తెలిపారు (Crime News).

Updated Date - 2023-02-13T16:20:30+05:30 IST