Shocking: స్మార్ట్‌ఫోన్ కోసం బాలికను అమ్మేసిన బాలుడు.. ఆ బాలికను కొన్న వారు ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

ABN , First Publish Date - 2023-03-15T20:39:59+05:30 IST

స్మార్ట్‌ఫోన్ కోసం ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ బాలికను ఓ వ్యక్తికి రూ.20 వేలకు అమ్మేశాడు.

Shocking: స్మార్ట్‌ఫోన్ కోసం బాలికను అమ్మేసిన బాలుడు.. ఆ బాలికను కొన్న వారు ఎంత దారుణానికి పాల్పడ్డారంటే..

స్మార్ట్‌ఫోన్ కోసం ఓ బాలుడు దారుణానికి పాల్పడ్డాడు. తన స్నేహితుడితో కలిసి 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆ బాలికను ఓ వ్యక్తికి రూ.20 వేలకు అమ్మేశాడు. ఆ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం బాధితురాలిని నిందితులు గంగా నదిలో పడేసి పారిపోయారు. మత్స్యకారులు బాలికను రక్షించి పోలీసులకు అప్పగించగా, ఆమె తన బాధను వివరించింది (Crime News).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఘాజీపూర్‌కు చెందిన ఓ బాలుడు తాపీ పని చేస్తుండేవాడు. అతడికి ఎప్పట్నుంచో ఓ స్మార్ట్‌ఫోన్ (Smart Phone) కొనుక్కోవాలని కోరిక. అయితే పేద కుటుంబానికి చెందిన వాడు కావడంతో అతడి వద్ద డబ్బులు ఉండేవి కావు. దీంతో తన స్నేహితుడితో కలిసి ఓ పథకం వేశాడు. తన పని చేస్తున్న ఇంటికి పక్కనే ఉండే 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ (Kidnap) చేశాడు. ఇద్దరూ కలిసి ఆ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి బైక్‌పై వారణాసి తీసుకెళ్లి రూ.20 వేలకు ఓ వ్యక్తికి అమ్మేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిందితులిద్దరూ ఘాజీపూర్‌కు తిరిగి వెళ్లిపోయారు.

Viral Video: అందరూ చూస్తుండగా ప్రియుడికి లిప్‌లాక్.. ముంబై లోకల్ ట్రైన్‌లో రెచ్చిపోయిన యువతి.. వైరల్ అవుతున్న వీడియో!

ఆ బాలికను కొనుక్కున్న యువకుడు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి (Sexual Harassment) పాల్పడ్డాడు. ఆ స్నేహితులిద్దరూ మైనర్లు కావడం గమనార్హం. అత్యాచారం అనంతరం ముగ్గురూ కలిసి ఆ బాలికను గంగా నదిలోకి విసిరేశారు. నదిలో పడి ఉన్న బాలికను మత్స్యకారులు రక్షించి పోలీసులకు అప్పగించారు. పోలీసులకు ఆ బాలిక మొత్తం విషయం చెప్పింది. వెంటనే స్పందించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో నలుగురు నిందితులు మైనర్లు కావడం గమనార్హం.

Viral Video: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న హాట్ గాళ్.. రాత్రికి రాత్రే స్టార్ అయిన ఆమె గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్

Updated Date - 2023-03-15T20:58:53+05:30 IST