ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారో కదా.. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ 24 గంటల్లోనే ఒకరి తర్వాత మరొకరు ఎలా చనిపోయారంటే..

ABN , First Publish Date - 2023-02-15T15:05:09+05:30 IST

ఆ యువతీ యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు.. పక్క పక్క ఇళ్లలోనే నివసించే వారు.. రెండేళ్ల క్రితం ప్రేమలో (Love Story) పడ్డారు.. కలిసి మెలిసి తిరిగారు.. విషయం అమ్మాయి తరఫు వారికి తెలియడంతో వారు అబ్బాయిని రెండు నెలల జైలులో పెట్టించారు..

ఎంత హ్యాపీగా కనిపిస్తున్నారో కదా.. రెండేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ 24 గంటల్లోనే ఒకరి తర్వాత మరొకరు ఎలా చనిపోయారంటే..

ఆ యువతీ యువకులు ఒకే గ్రామానికి చెందిన వారు.. పక్క పక్క ఇళ్లలోనే నివసించే వారు.. రెండేళ్ల క్రితం ప్రేమలో (Love Story) పడ్డారు.. కలిసి మెలిసి తిరిగారు.. విషయం అమ్మాయి తరఫు వారికి తెలియడంతో వారు అబ్బాయిని రెండు నెలల జైలులో పెట్టించారు.. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా వారి ప్రేమ కొనసాగింది.. మళ్లీ ఆ కుర్రాడిని పోలీసులు తీసుకెళ్లారు.. అలా తరచుగా పోలీసులు తనను వేధిస్తుండడంతో ఆ అబ్బాయి ఉరేసుకుని చనిపోయాడు.. విషయం తెలుసుకున్న అమ్మాయి తర్వాతి రోజు తన ప్రియుడి చనిపోయిన స్థలంలోనే ఉరేసుకుని చనిపోయింది (Lovers Suicide).

ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హర్దోయ్ జిల్లాలో జగై గ్రామానికి చెందిన రాంసాగర్ (22), నీతూ (19) చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఏడాది క్రితమే నీతూ కుటుంబ సభ్యులకు వీరి వ్యవహారం తెలిసింది. ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. ఇకపై కలవకూడదని తీర్మానించారు. అయినా రాంసాగర్, నీతూ వినలేదు. తరచుగా కలిసి తిరిగేవారు. విషయం తెలుసుకున్న నీతూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాంసాగర్‌ను అరెస్ట్ చేసి జైలులో పెట్టారు (Crime News).

Shocking Incident: ఒంటరిగా గదిలో ఉంచినా.. ఎలా గర్భం దాల్చింది..? తండ్రెవరో తేల్చేందుకు చేసిన డీఎన్‌ఏ టెస్టుల్లో మైండ్‌బ్లాకయ్యే ట్విస్ట్..!

రెండు నెలల తర్వాత విడుదలైన రాంసాగర్.. నీతూను కలవడం మాత్రం మానలేదు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మళ్లీ రాంసాగర్‌ను అరెస్ట్ చేశారు. తరచూ పోలీసులు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన రాంసాగర్ సోమవారం ఉదయం ఓ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు అదే తోటలో నీతూ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు ప్రేమికులు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Updated Date - 2023-02-15T15:05:11+05:30 IST