Share News

Couple Murder: ఇంట్లోనే భార్యాభర్తల దారుణ హత్య.. ఆధారాలు లేక ఆగిపోయిన దర్యాప్తు.. 21 ఏళ్ల తర్వాత..

ABN , First Publish Date - 2023-11-10T17:30:05+05:30 IST

హర్యానాలో జరిగిన ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ వ్యక్తిని పోలీసులు దాదాపు 21 ఏళ్ల తరువాత పట్టుకున్నారు. ఫోన్ కూడా వాడని నిందితుడికి సంబంధించి లభించిన ఒకే ఒక్క క్లూతో కేసును కొలిక్కి తీసుకొచ్చారు.

Couple Murder: ఇంట్లోనే భార్యాభర్తల దారుణ హత్య.. ఆధారాలు లేక ఆగిపోయిన దర్యాప్తు.. 21 ఏళ్ల తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు 21 ఏళ్ల క్రితం జరిగిందీ దారుణం. ఇద్దరు అన్నదమ్ములు ఓ దంపతులను హత్య చేసి రాత్రికిరాత్రి పారిపోయారు. చాలా రోజుల పాటు నిందితుల ఆచూకీ పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కాలేదు. చివరకు ఇటీవల లభించిన క్లూతో నిందితుల్లో ఒకడిని అరెస్టు చేశారు. పంజాబ్‌లో వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

Crime: హత్య కేసులో బెయిల్‌పై వచ్చి చనిపోయినట్టు సీన్ క్రియేట్.. 8 ఏళ్ల తర్వాత పెళ్లికార్డులో చేసిన ఒక్క పొరపాటుతో..!

సోనీపత్ జిల్లాకు చెందిన రాజేశ్ టీవీ మెకానిక్. అతడి స్వగ్రామమైన నాంగల్ ఖుర్ద్ ప్రాంతంలో భార్య నీలమ్‌తో కలిసి నివసిస్తుండేవాడు. అతడికి ఓ ఎస్‌టీడీ షాప్ కూడా ఉంది. కాగా, 2002 జనవరి 17న ఆ దంపతులు అకస్మాత్తుగా హత్యకు గురయ్యారు. ఆ రోజు రాజేశ్ ఇంటికి వెళ్లిన అతడి సోదరుడికి ఆ దంపతులు విగతజీవులుగా కనిపించడంతో షాకైపోయాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Police vs Woman: హెల్మెట్ ఏదయ్యా..? నీ హెల్మెట్ ఏది..? అంటూ పోలీసును ఈ మహిళ ఎలా ఆటాడేసుకుందో మీరే చూడండి..!


కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అదే ప్రాంతంలో నివసిస్తున్న వినోద్ మండల్, అతడి సోదరుడిపై అనుమానం మొదలైంది. వినోద్ మండల్ స్వస్థలం బీహార్‌లోని ఆరారియా జిల్లా. హత్య జరిగాక వినోద్ తన సోదరుడితో కలిసి అదృశ్యమైపోయాడు. వారి ఆచూకీ కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా లభించలేదు. అతడు ఫోన్ కూడా వాడకపోవడంతో దర్యాప్తు దాదాపుగా నిలిచిపోయినట్టైంది. అయితే, ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితుల కోసం గాలిస్తూనే ఉంది.

Vivek Ramaswamy: నువ్వో చెత్త, నా కూతురి పేరెత్తొద్దు..వివేక్ రామస్వామిపై విరుచుకుపడ్డ అమెరికన్ నేత

అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.25 వేల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే, కేసుపై బీహార్ పోలీసులు కూడా దృష్టి సారించారు. ఈ క్రమంలో మాధేపూర్ జిల్లా గమ్డియా గ్రామ బస్టాండ్‌లో వినోద్ ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో, పోలీసులు వెంటనే అక్కడికెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానా దంపతులను ఎందుకు హత్య చేశాడో తెలుసుకునేందుకు అతడిని విచారిస్తున్నారు. నిందితుడి సోదరుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు.

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

Woman Constable: ఈ ఫొటోలోని కానిస్టేబుల్ ఉద్యోగం ఊస్ట్.. తెలియక ఆమె చేసిన ఒక్క మిస్టేక్‌తో పోలీస్ శాఖలో హాట్ టాపిక్..!

Updated Date - 2023-11-10T17:34:32+05:30 IST