Share News

Viral News: పక్కనే ఉంటూ.. ప్రియుడిని చంపేందుకు ఓ ప్రేయసి పక్కా స్కెచ్.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది కానీ..!

ABN , First Publish Date - 2023-11-06T19:11:58+05:30 IST

ప్రియుడితో సన్నిహితంగా ఉంటేనే అతడిని చంపేందుకు ఓ మహిళ ప్లాన్ వేసింది. తన వ్యాపారం పెంచుకునేందుకు అతడిని బలిపశువును చేసింది.

Viral News: పక్కనే ఉంటూ.. ప్రియుడిని చంపేందుకు ఓ ప్రేయసి పక్కా స్కెచ్.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది కానీ..!

ఇంటర్నెట్ డెస్క్: ప్రియుడితో సన్నిహితంగా ఉంటూనే అతడిని చంపేందుకు ఓ మహిళ ప్లాన్ వేసింది. తన వ్యాపారం పెంచుకునేందుకు అతడిని బలిపశువును చేసింది. అప్పటికే ఓ కేసులో జైలుకు వెళ్లివచ్చిన ఆమె వేసిన ప్లాన్ చిట్టచివర్లో బట్టబయలు కావడంతో మరోసారి జైలు పాలు కావాల్సి వచ్చింది. బెంగళూరులో (Bengaluru) వెలుగు చూసిన ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే,

NRI: గుడ్ న్యూస్.. హెచ్-1బీ వీసాదారులకు భారీ ఊరట

Viral Video: బాబోయ్..భీముడు మళ్లీ పుట్టాడా? పుట్టిన వెంటనే ఈ నవజాత శిశువు చేసిన పనికి నర్సు షాక్!

నగరంలో బ్యూటీ పార్లర్ నిర్వహించే శోభ అనే మహిళ చేతన్(Live in partner) అనే వ్యక్తితో సహజీవనంలో ఉంది. చేతన్, శోభలకు సతీశ్ అనే స్నేహితుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే తన వ్యాపార విస్తరణకు కోసం ప్రయత్నిస్తున్న శోభ స్థితిమంతుడైన సతీశ్‌కు(boy friend) దగ్గరైంది. ఈ క్రమంలో వారిద్దరూ చేతన్‌ను అడ్డుతొలగించుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో వారు చేతన్‌ను ఏమాత్రం అనుమానం రాకుండా అతడిని అంతమొందించేందుకు ఓ భారీ కుట్రకు తెరలేపారు(Woman plots to kill live in partner with the help of boyfriend).

Viral Video: ఇలాంటి భార్యను మీరెక్కడా చూసుండరు! రైల్వే స్టేషన్‌లో మొగుడ్ని ఏ రేంజ్‌లో తుక్కు రేగ్గొట్టిందో చూస్తే..


ఈ క్రమంలో అక్టోబర్ 26న శోభ, చేతన్, సతీశ్‌.. శశి, మధు అనే మరో ఇద్దరితో కలిసి మందుపార్టీ చేసుకున్నారు. చేతన్‌ను హత్య చేయించేందకు సతీశే శశి మధులను రప్పించాడు. కాగా, పార్టీ మొదలైన కాసేపటికి శోభ తన ఇంటికి వెళ్లిపోయింది. ఆ తరువాత శశి, మధులతో కలిసి సతీశ్ తన పథకాన్ని అమలు చేశాడు. పార్టీ తరువాత ఆ ముగ్గురూ చేతన్‌ను ఇంటివద్ద దిగబెట్టేందుకు కారులో బయలు దేరారు. అయితే మార్గమధ్యంలో ముగలూరు వద్ద కారు ఆపి అతడిని హత్య చేశారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో అతడిని పొడిచి చంపేశారు. అనంతరం, మృతదేహాన్ని పక్కనే ఉన్న నదిలో పడేసి పారిపోయారు. మరుసటి రోజు పోలీసులకు దక్షిణ పినాకిని నదిలో చేతన మృతదేహం కొట్టుకొచ్చిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా చేతన్ స్నేహితులను ప్రశ్నించారు.

Viral: ఈ సింహానికి ఏమైంది? నడిరోడ్డు మీద ఊహించని విధంగా.. వీడియో చూసి షాకైపోతున్న జనాలు!

ఈ సందర్భంగా శోభపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో, పోలీసులు ఆమెను అదుపులో తీసుకుని ప్రశ్నించగా నిజం ఒప్పుకోకతప్పలేదు. సతీశ్ సాయంతో తన బిజినెస్ విస్తరించుకోవాలనుకున్న శోభ చేతన్‌ను అడ్డుతొలగించుకునేందుకు ఇదంతా చేసిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-11-06T19:12:02+05:30 IST