మార్కెట్‌లోకి బీరు ప్రియులు ఇష్టపడే షూ... దీని ప్రత్యేకతల గురించి తెలిస్తే...

ABN , First Publish Date - 2023-03-28T12:21:32+05:30 IST

ప్రముఖ షూ కంపెనీ హీనెకెన్ ప్రత్యేకంగా32 జతల షూలను తయారు చేసి ప్రపంచ వ్యాప్తం(Worldwide)గా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే

మార్కెట్‌లోకి బీరు ప్రియులు ఇష్టపడే షూ... దీని ప్రత్యేకతల గురించి తెలిస్తే...

ప్రముఖ షూ కంపెనీ హీనెకెన్ ప్రత్యేకంగా32 జతల షూలను తయారు చేసి ప్రపంచ వ్యాప్తం(Worldwide)గా ప్రచారం చేస్తోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ షూస్‌ను హీనెకెన్... బీర్ బాటిల్స్ మాదిరిగా డిజైన్ చేసింది. ఈ బూట్లతో ప్రత్యేకమైన ఓపెనర్‌ కూడా వస్తుంది.

బీర్ తీసుకోవడానికి ఈ ఓపెనర్‌(Opener)లను ఉపయోగించవచ్చు. కంపెనీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించింది. వీటిలోని ఏడు బూట్లు సింగపూర్‌(Singapore)లో ప్రదర్శించారు. ఈ బూట్లు చైనా, తైవాన్, ఇండియా, కొరియా(Korea)లో అందుబాటులో ఉంచారు. ఈ షూస్ గ్రీన్, వైట్ కలర్‌లో వస్తాయి. ఈ షూలలో బీర్ నింపుతారు. ఈ షూల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది, కొందరు దీన్ని ఇష్టపడుతుడగా, మరికొందరు ఇది వ్యర్థమంటూ కామెంట్(Comment) చేస్తున్నారు.

Updated Date - 2023-03-28T12:25:26+05:30 IST