Bar tailed godwit : ఈ పక్షి అలాస్కా నుండి ఆస్ట్రేలియాకు ఆగకుండా ఎగిరి, గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టింది..

ABN , First Publish Date - 2023-01-10T12:02:05+05:30 IST

ఆహారం కోసం పక్షి ఒక్కసారి కూడా నేల మీదకు దిగకుండా 11 రోజుల, ఒక గంట పాటు ప్రయాణించిందట.

Bar tailed godwit : ఈ పక్షి అలాస్కా నుండి ఆస్ట్రేలియాకు ఆగకుండా ఎగిరి, గిన్నీస్ రికార్డ్ బద్దలు కొట్టింది..
Guinness book of world record

ఈ బార్-టెయిల్డ్ గాడ్‌విట్ పక్షి అలాస్కా నుండి ఆస్ట్రేలియాలోని టాస్మానియాకు 8,435 మైళ్లు నాన్‌స్టాప్‌గా ప్రయాణించి, ఈ పక్షి అత్యధిక ప్రయాణం చేసింది. అదీ వలస వెళ్లే నాన్-స్టాప్ గా ఎగురుతూ వెళ్ళింది. ఈ క్రమంలోనే మునుపటి రికార్డును అధిగమించింది. బార్ టెయిల్డ్ గాడ్ విట్ పక్షి విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా దాదాపు 11 రోజుల ప్రయాణం చేసింది. దీని సుదీర్ఘ ప్రయాణాన్ని ఉపగ్రహ ట్యాగ్ ద్వారా ట్రాక్ చేసినపుడు ఈ ప్రయాణం ఎంత పట్టుదలగా సాగిందో తెలిసింది. అంతే కాదు.. ఇది ఇంతకమునుపు దాని రికార్డ్ ను అదే దాటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, "234684" అనే ట్యాగ్ నంబర్‌తో పిలువబడే బార్-టెయిల్డ్ గాడ్‌విట్ (లిమోసా లాప్పోనికా), అలాస్కా నుండి ఆస్ట్రేలియన్ రాష్ట్రమైన టాస్మానియాకు 13,560 కిలోమీటర్లు (8,435 మైళ్ళు) ఆహారం, విశ్రాంతి కోసం ఆగకుండా ప్రయాణించి రికార్డును బద్దలు కొట్టింది.

guinness.jpg

ఇది కవర్ చేసిన దూరం లండన్ నుంచి న్యూయార్క్ మధ్య రెండున్నర పర్యటనలకు సమానం, అలాగే భూ గ్రహం పూర్తి చుట్టుకొలతలో దాదాపు మూడింట ఒక వంతు. ఈ పక్షి వీపుకు అతికించిన 5G ఉపగ్రహ ట్యాగ్ ప్రకారం, ఈ ప్రయాణం గత సంవత్సరం అక్టోబర్ 13, 2022న ప్రారంభమైంది. , అయితే ఆహారం కోసం పక్షి ఒక్కసారి కూడా నేల మీదకు దిగకుండా 11 రోజుల, ఒక గంట పాటు కొనసాగిందట.

Updated Date - 2023-01-10T12:07:23+05:30 IST