Bank holidays in May 2023: కస్టమర్లూ.. బీ అలెర్ట్.. మే నెలలో ఏకంగా 11 రోజుల పాటు సెలవులు.. ఏఏ తేదీల్లో బ్యాంకులు పనిచేయవంటే..!
ABN , First Publish Date - 2023-05-01T15:43:07+05:30 IST
మే నెల వచ్చేసింది. సెలవు దినంతో మే నెల ప్రారంభమైంది. ప్రతి నెలలోనూ బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయతో తెలిపే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది.
మే (May) నెల వచ్చేసింది. సెలవు దినంతో మే నెల ప్రారంభమైంది. ప్రతి నెలలోనూ బ్యాంకులు ఎప్పుడెప్పుడు పనిచేయవో తెలిపే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) విడుదల చేస్తుంది. ఆర్బీఐ జాబితా ప్రకారం ఈ నెలలో 11 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. దేశంలోని బ్యాంకులు ఆదివారంతో పాటు రెండో, నాలుగో శనివారం సెలవులో ఉంటాయి. అలాగే వివిధ రాష్ట్రాల్లో స్థానిక పండగల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి వేసి ఉంటాయి (Bank holidays in May 2023).
సెలవు రోజుల్లో బ్యాంకులు మూసివేసి ఉన్నప్పటికీ ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంకుకు వెళ్లి నేరుగా పూర్తి చేసుకోవాల్సిన పనులు ఉంటే మాత్రం తప్పకుండా సెలవులను గమనించుకోవాలి.
మే నెలలో బ్యాంకు సెలవులు..
మే 1: మేడే (కార్మిక దినోత్సవం)
మే 5: బుద్ధ పూర్ణిమ (పశ్చిమ బెంగాల్ , ఉత్తరాఖండ్ , అసోం, బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్ , గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు)
మే 7: ఆదివారం
మే 9: రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవం
మే 13: రెండో శనివారం
మే 14: ఆదివారం
మే 16: సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం (సిక్కింలో బ్యాంకులు పనిచేయవు)
మే 21: ఆదివారం
మే 22 (సోమవారం): మహారాణా ప్రతాప్ జయంతి (గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల బ్యాంకులకు సెలవు)
మే 24: కాజీ నజ్రుల్ ఇస్లాం జయంతి (త్రిపుర బ్యాంకులకు సెలవు)
మే 27: నాలుగో శనివారం
మే 28: ఆదివారం