Bank Account: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి.. 10 ఏళ్ల వరకు ముట్టుకోకుండా ఉంటే జరిగేదేంటి..? బ్యాంకులు ఏం చేస్తాయంటే..

ABN , First Publish Date - 2023-04-05T20:54:04+05:30 IST

పిల్లల చదువులని(Children's educations), పెళ్ళిళ్ళకు అక్కరకొస్తాయని(For marriage purpose) ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి

Bank Account: బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి.. 10 ఏళ్ల వరకు ముట్టుకోకుండా ఉంటే జరిగేదేంటి..? బ్యాంకులు ఏం చేస్తాయంటే..

డబ్బంటే ఎవడికి చేదండీ బూబూ.. తేనెటీగలు తేనెను కూడబెట్టినట్టు ప్రతి ఒక్కరూ డబ్బు కూడబెడతారు. డబ్బు దాచుకోవడానికి చాలా మందికి సేఫ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది బ్యాంకే.. తమ దగ్గరున్న డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్(Fixed deposits) లు వేసి అవి వడ్డీతో సహా అలా పెరుగుతూంటాయిలే(Increase with interest) అనుకునేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువులని(Children's educations), పెళ్ళిళ్ళకు అక్కరకొస్తాయని(For marriage purpose) ముందు జాగ్రత్తగా ఇలా డిపాజిట్లు వేస్తుంటారు. కానీ అలా డిపాజిట్లు వేసి ఓ 10ఏళ్ళ పాటు దాన్ని అలా వదిలేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? 10సంవత్సరాల వరకు మీరు ఆ డబ్బును ముట్టకపోతే(If you don't touch money till 10years) బ్యాంకులు ఏం చేస్తాయో తెలిస్తే షాకవుతారు. బ్యాంకు డిపాజిట్ల(Bank deposits) గురించి ఎవరీకీ తెలియని షాకింగ్ నిజమిదే..

కారణాలు ఎన్నైనా బ్యాంకులలో డిపాజిట్లు వేసేవారు అధికం. ముఖ్యంగా సగటు మధ్యతరగతి కుటుంబాలు ఇలా బ్యాంకులలో(Middle families deposits more money) భవిష్యత్తు అవసరాలకోమంటూ డిపాజిట్లు వేస్తాయి. కానీ డిపాజిట్ వేసిన డబ్బును అప్పుడప్పుడు క్లెయిమ్(claimed) చేసుకుంటూ ఉండాలి. డిపాజిట్ వేసిన ఖాతా నుండి లావాదేవీలు జరుపుతూ ఉండాలి. అలా కాకుండా ఆ డబ్బును అలాగే 10ఏళ్ళు వదిలేస్తే దాని మీద హక్కు కోల్పోతారు(Loss of right). క్లెయిమ్ చేయని డిపాజిట్లన్నీ 'అన్-క్లెయిమ్' డిపాజిపాట్(Deposits become unclaimed after 10years) గా పరిగణించబడతాయి. ఇలా వ్యక్తులు అర్హత కోల్పోయాక ఆ డబ్బును రిజర్వ్ బ్యాంకు స్వాధీనం చేసుకుంటుంది(Money takes over reserve bank). రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన 'డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్'(deposit education and awareness fund) కు ఈ నగదు బదిలీ చేయబడుతుంది.

Read also: Washing Machine Blast: సడన్‌గా బ్లాస్ట్ అయిపోయిన వాషింగ్ మెషీన్.. మంటలు చెలరేగి బీభత్సం.. దుస్తులను వేసి ఆన్ చేసిన కొద్ది నిమిషాలకే


ఈ నిబంధల అనుగుణంగానే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్(Public sector bank) ఇటీవల రిజర్వ్ బ్యాంక్ కు 35వేల కోట్ల(more than 35thousand crores) కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చింది. ఈ బ్యాంకులు ఈ ఏడాది ఫిబ్రవరిలో 35,012కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంకుకు సమర్పించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవలే పార్లమెంటులో వెల్లడించింది. ఇలా కస్టమర్లు అన్-క్లెయిమ్(Unclaimed) చేయని మొత్తాలు స్టేట్ బ్యాంక్(State bank) లోనే ఎక్కువ ఉన్నాయి. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National bank), కెనరా బ్యాంక్(Canara bank) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. మీరు బ్యాంకులలో డిపాజిట్లు వేసి ఉన్నా.. వాటిని టచ్ చేయకుండా కొండలా పెంచుకోవాలని అత్యాశకు పోయినా నష్టపోతారు కాబట్టి జాగ్రత్త..

Read also: AC vs Coolers: కూలరా..? ఏసీనా..? రెండింటిలో ఏది బెస్ట్..? దేని నుంచి వచ్చే గాలి మంచిది..? చాలా మందికి తెలియని నిజాలివి..!


Updated Date - 2023-04-05T20:54:04+05:30 IST