Balakrishna : దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారకరం

ABN , First Publish Date - 2023-02-03T09:30:39+05:30 IST

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు.

Balakrishna : దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారకరం

K Viswanath No more : టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్ను మూశారు. అపోలో ఆసుపత్రిలో గత రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. కె విశ్వనాథ్ మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ దర్శకుడు కె విశ్వనాథ్ మరణంపై సినీ నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ‘‘కళాతపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూయడం తెలుగు చలన పరిశ్రమకి తీరని లోటు.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వకారణం. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమకే వన్నె తెచ్చి.. ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురి చేసింది. కళా తపస్వి ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-02-03T09:30:56+05:30 IST