Ravindra Kaushik: ‘రా’ రియల్ ఏజెంట్‌పై బయోపిక్!

ABN , First Publish Date - 2023-02-09T18:52:22+05:30 IST

ఎమ్‌ఎస్.ధోనీ, గుంజన్ సక్సేనా, విక్రమ్ బాత్రా వంటి ప్రముఖుల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. తాజాగా మరొకరి జీవిత చరిత్ర వెండితెర మీదికి రానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహించనున్నారు.

Ravindra Kaushik: ‘రా’ రియల్ ఏజెంట్‌పై బయోపిక్!

ఎమ్‌ఎస్.ధోనీ, గుంజన్ సక్సేనా, విక్రమ్ బాత్రా వంటి ప్రముఖుల బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టాయి. తాజాగా మరొకరి జీవిత చరిత్ర వెండితెర మీదికి రానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహించనున్నారు.

పాకిస్తాన్‌లో భారతీయ గూఢచారిగా పనిచేసిన వ్యక్తి రవీంద్ర కౌశిక్ (Ravindra Kaushik). రా ఏజెంట్‌గా 20ఏళ్ల వయసులోనే సేవలు అందించారు. దేశ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి దేశ భద్రతకు తోడ్పడ్డారు. ఆయన జీవిత్ర చరిత్ర సినిమాగా రూపొందనుంది. ‘ది బ్లాక్‌ టైగర్‌’ (The Black Tiger) పేరుతో వెండితెర మీదికి రానుంది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు (Anurag Basu) దర్శకత్వం వహించనున్నారు. అందుకు సంబంధించి ఓ ప్రకటనను జారీ చేశారు. ‘‘రవీంద్ర కౌశిక్ జీవితం ధైర్యం, పరాక్రమానికి అద్దం పడుతుంది. ఆయన 20ఏళ్ల వయసులోనే జాతీయ, అంతర్జాతీయ భద్రతలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. దక్షిణాసియాలోనే ఇండియాకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. మన గత చరిత్ర కొంత మరుగునపడింది. మరి కొంత మరిచిపోయారు. ఈ విధమైన రియల్ హీరోల ధైర్యసాహాసాలను అందరం తప్పక గుర్తుంచుకోవాలి’’ అని అనురాగ్ బసు చెప్పారు.

రవీంద్ర కౌశిక్ ఇండియన్ బెస్ట్ స్పై ఏజెంట్. పాకిస్తాన్ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1974 నుంచి 1983 వరకు సేవలు అందించారు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ పన్నిన అనేక కుట్రలను చేధించారు. రవీంద్రను ‘ది బ్లాక్ టైగర్’ పేరుతో పిలిచేవారు. ప్రస్తుతం అదే టైటిల్‌తో సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని అనురాగ్ బసు, ఆర్. వివేక్, దివే దమిజ నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటిస్తున్నట్టు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) గతంలో చెప్పారు. రైడ్ ఫేమ్ రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. ప్రస్తుతం డైరెక్టర్ మాత్రం మారారు.. హీరో పాత్రను సల్మాన్ చేస్తారా.. మరొకరు పోషిస్తారా అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.

^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

NTR 30: జూనియర్ ఎన్‌టీఆర్‌‌కు విలన్ ఫిక్స్ అయ్యారా..?

Ram Charan: మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

Prakash Raj: ‘ది కశ్మీర్ ఫైల్స్’ చెత్త సినిమా.. భాస్కర్ అవార్డు కూడా రాదంటున్న నటుడు

Updated Date - 2023-02-09T18:53:30+05:30 IST