Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

ABN , First Publish Date - 2023-02-07T17:09:35+05:30 IST

సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్‌ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్‌(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Allu Arjun - Pushpa 2: నిరాశతో అభిమానులు కన్నీరు.. ఏం జరిగిందంటే!

సినిమా, సినిమాకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ ఐకాన్‌ స్టార్‌గా (icon star)ఎదిగారు అల్లు అర్జున్‌(Allu arjun). 2021లో విడుదలైన ‘పుష్ప’ (Pushpa 2)సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో దేశ వ్యాప్తంగా బన్నీ క్రేజ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ‘పుష్ప2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతోంది(shoot in Vizag). షాట్‌ గ్యాప్‌లో బన్నీ అభిమానులతో కలిసి ఫొటోషూట్‌ ఏర్పాటు చేశారు. ఆయన్ని చూేసందుకు అధిక సంఖ్యలో అభిమానులు షూటింగ్‌ స్పాట్‌కి చేరుకున్నారు. హీరోకి ఉన్న తక్కువ సమయంలో షొటో షూట్‌ను నిర్వహించారు. కొందరు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అక్కడ గందరగోళం నెలకొంది. దీంతో అభిమానుల తాకిడిని కంట్రోల్‌ చేయలేక ఫొటో షూట్‌ రద్దు (Photo shoot Cancel )చేశారు. బన్నీతో ఫొటో దిగేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. అందులో కొందరు అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. Bunny fans crying at photo Shoot)

Updated Date - 2023-02-07T17:59:42+05:30 IST