Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

ABN , First Publish Date - 2023-02-17T14:11:10+05:30 IST

‘పుష్ప’(Pushpa) చిత్రంతో ప్యాన్‌ ఇండియా (pan india hero) స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్రతో ఐకాన్‌స్టార్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకూ దక్షిణాదికే పరిమితమైన బన్నీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఈ చిత్రంతో ప్యాన్‌ ఇండియాకు చేరుకుంది.

Allu Arjun: ఆ స్టైలిష్‌ లుక్‌ అదిరింది.. పుష్పరాజ్‌ కోసమేనా?

‘పుష్ప’(Pushpa) చిత్రంతో ప్యాన్‌ ఇండియా (pan india hero) స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. పుష్పరాజ్‌ పాత్రతో ఐకాన్‌స్టార్‌ క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకూ దక్షిణాదికే పరిమితమైన బన్నీ క్రేజ్‌, ఫాలోయింగ్‌ ఈ చిత్రంతో ప్యాన్‌ ఇండియాకు చేరుకుంది. అందుకే తన తదుపరి చిత్రం ‘పుష్ఫ-2’(Pushpa 2) కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బన్నీ ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ట్విట్టర్‌ ప్రొఫైల్‌ (Bunny profile pic Viral) పిక్చర్‌ మార్చారు. బ్లాక్‌ షర్ట్‌లో కర్లీ హెయిర్‌తో సూపర్‌ స్టైలిష్‌గా కనిపించారు. అయితే ఈ ఫొటో ఎప్పటిదో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది. నెట్టింట విపరీతంగా షేర్‌ అవుతుంది. ఫ్యాన్స్‌ పేజీల్లో వైరల్‌ అవుతోంది. ‘పుష్పరాజ్‌’ పాత్రలో అల్లు అర్జున్‌ ఊర (allu arjun stylish look) మాస్‌ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం జరుగుతున్న షూట్‌లో కూడా అదే లుక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త లుక్‌ బయటికొచ్చాక పుష్ప 2 చిత్రీకరణలో ఎలాంటి అవతారంలో కనిపిస్తారనే ఎగ్జైట్‌మెంట్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే దర్శకుడు ‘పుష్ప 2’ తొలి భాగానికి మించేలా ఉండాలని పలు మార్పులు చేశారు. అందులో భాగంగా అల్లు అర్జున్‌ ఈ కొత్త లుక్‌లో కనిపించనున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. పార్ట్‌2లో సుకుమార్‌ బన్నీని కొత్తగా చూపించనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లుక్‌ ‘పుష్ప-2’ కోసమా లేక మరేదైన ప్రయత్నమా అన్నది తెలియాల్సి ఉంది. రష్మిక మందన్నా కథానాయికగా ఫవాద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలొ నటించనున్న ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, సాయి పల్లవి నటించనున్నారని గుసగుసలు విపినిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Updated Date - 2023-02-17T14:34:56+05:30 IST