Allu Arjun - Martin Garrix: మరోసారి ఆ పాటకు స్టెప్‌... ఎవర్‌గ్రీన్‌ సమంత!

ABN , First Publish Date - 2023-03-05T17:11:05+05:30 IST

‘పుష్ప’ (Pushpa)చిత్రంతో అల్లు అర్జున్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా (pan india Star) ఎదిగారు. ఆ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే! అందులో డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Allu Arjun - Martin Garrix: మరోసారి ఆ పాటకు స్టెప్‌... ఎవర్‌గ్రీన్‌ సమంత!

‘పుష్ప’ (Pushpa)చిత్రంతో అల్లు అర్జున్‌ ప్యాన్‌ ఇండియా స్టార్‌గా (pan india Star) ఎదిగారు. ఆ చిత్రం ఏ స్థాయి విజయం సాధించిందో తెలిసిందే! అందులో డైలాగ్‌లు, పాటలు ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఏ ఈవెంట్‌ జరిగినా ఆ వేదికపై ‘పుష్ప’ పాటలు, డైలాగ్‌లు వినిపించాల్సిందే. అందులో బన్నీ ‘తగ్గేదేలే’ మేనరిజం కనిపించాల్సిందే. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సింగర్‌ మార్టిన్‌ గ్యారిక్స్‌ (Martin Garrix live show) పుష్ప పాటతో సందడి చేశాడు. మార్టిన్‌ గ్యారిక్స్‌ తాజాగా హైదరాబాద్‌లో ఓ ఈవెంట్‌ నిర్వహించాడు. దీనికి వేల మంది సంగీత ప్రియులు హాజరయ్యారు. వారితోపాటు అల్లు అర్జున్‌ (allu Arjun) కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై ఆశ్చర్యపరిచాడు. మార్టిన్‌ గ్యారిక్స్‌ పాడిన ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా’ (oo antava maava) పాటకు ఆయన కూడా స్టెప్పులేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. మార్టిన్‌ గ్యారిక్స్‌ పాడుతుండగా పాట మధ్యలో బన్నీ స్టేజ్‌ మీదకు వచ్చి డ్యాన్స్‌ వేయడంతో ఆడియన్స్‌ ఉర్రూతలూగారు. అలాగే మార్టిన్‌ గ్యారిక్స్‌తో కలిసి దిగిన ఫొటోలను అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ‘ఎంతో ఆనందంగా ఉంది. తగ్గేదేలే’’ అని రాశాడు. ఈ వీడియోను సమంత కూడా షేర్‌ చేశారు. ఎప్పటికీ ఈ పాట ఎవర్‌గ్రీన్‌ అని కామెంట్‌ చేశారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ ‘పుష్ప2’ (Pushpa2) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వైజాగ్‌ పోర్ట్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తదుపరి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ ప్యాన్‌ ఇండియా చిత్రం చేయబోతున్నారు. టీ-సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మించనున్నారు. (Allu arjun Dance for oo ANvata maava)

Updated Date - 2023-03-05T17:11:05+05:30 IST