Wildlife Conservation Award:కశ్మీర్ మహిళకు మొట్ట మొదటిసారి వన్యప్రాణి సంరక్షణ అవార్డు

ABN , First Publish Date - 2023-03-27T12:57:49+05:30 IST

మొట్ట మొదటిసారి జమ్మూకశ్మీరుకు చెందిన అలియా మీర్ అనే మహిళకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు లభించింది....

Wildlife Conservation Award:కశ్మీర్ మహిళకు మొట్ట మొదటిసారి వన్యప్రాణి సంరక్షణ అవార్డు
First woman Wildlife Rescuer Alia Mir

శ్రీనగర్ : మొట్ట మొదటిసారి జమ్మూకశ్మీరుకు చెందిన అలియా మీర్ అనే మహిళకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అవార్డు లభించింది.(Wildlife Conservation Award) వైల్డ్‌లైఫ్ రెస్క్యూ టీమ్‌లో భాగమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్న అలియా మీర్(Alia Mir) కశ్మీర్‌లోని మొదటి మహిళ కావడం విశేషం.( first woman wildlife rescuer) ఆలియా మీర్‌ను జమ్మూ కాశ్మీర్ వన్యప్రాణుల సంరక్షణ అవార్డుతో లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా సత్కరించారు.

జమ్మూ కాశ్మీర్ కలెక్టివ్ ఫారెస్ట్స్ నిర్వహించిన ప్రపంచ అటవీ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ సామాజికవేత్త అలియా మీర్‌కు ఈ అవార్డు లభించింది.సన్మానం పొందిన అనంతరం అలియా మాట్లాడుతూ... ఈ గౌరవం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.‘‘నాకు ఈ అవార్డు లభించినందుకు థ్రిల్‌గా ఉన్నాను. అడుగడుగునా నన్ను నమ్మి ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు’’ అని అలియా తెలిపింది.

Updated Date - 2023-03-27T12:57:49+05:30 IST