Daughter's Enthusiasm: ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలకు పుత్రికోత్సాహం

ABN , First Publish Date - 2023-05-31T22:12:55+05:30 IST

ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా జంటకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. శ్లోకా మెహతా బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Daughter's Enthusiasm: ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతాలకు పుత్రికోత్సాహం

ఇంటన్నెట్ డెస్క్: అంబానీ కుటుంబంలోకి ఓ బుజ్జి యువరాణి వచ్చి చేరింది. ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా జంటకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఇటీవల జరిగిన ఓ ఓపెనింగ్ వేడుకల్లో తన రెండవ బేబీ బంప్‌ను ప్రకటించిన శ్లోకా మెహతా బుధవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

రెండవ బిడ్డ రాకకు వారం ముందు శ్లోకా మెహతా తన భర్త ఆకాష్ అంబానీ, ఆమె మామ ముఖేష్ అంబానీ, కొడుకు పృథ్వీతో కలిసి ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. NMACC ఓపెనింగ్ వేడుకల సందర్భంగా, శ్లోకా తన బేబీ బంప్‌ను ప్రదర్శించారు.

కాగా 2019 మార్చిలో ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 2020లో మొదటి బిడ్డ పృథ్వీని స్వాగతించారు.

Updated Date - 2023-05-31T22:12:55+05:30 IST