Aishwarya Rai Bachchan: 23 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!

ABN , First Publish Date - 2023-01-16T16:35:58+05:30 IST

ఈ అందాల భామకు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో షికార్లు కొడుతుంది. స్టార్ హీరో పక్కన ఐష్ నటించే అవకాశముందని తెలుస్తోంది.

Aishwarya Rai Bachchan: 23 ఏళ్ల తర్వాత స్టార్ హీరోతో సినిమా!

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్‌గా మారిన అందాల భామ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai). రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ పీక్‌లో ఉండగానే అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) ను పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడింది. కొన్నాళ్ల క్రితమే ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చింది. కొత్త రకం పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు అలరిస్తోంది. ఈ మధ్యనే ‘పొన్నియిన్ సెల్వన్’ (Ponniyin Selvan) సినిమాలో కనిపించింది. తాజాగా ఈ అందాల భామకు సంబంధించిన ఓ అప్‌డేట్ మీడియాలో షికార్లు కొడుతుంది. స్టార్ హీరో పక్కన ఐష్ నటించే అవకాశముందని తెలుస్తోంది.

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్‌ (Ajith Kumar) హీరో‌గా విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో రూపొందించనుంది. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఏకే62’ అని వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారని త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, కియారా అడ్వాణీతో సహా పలువురి పేర్లు వినిపించాయి. తాజాగా మరో స్టార్ హీరోయిన్ పేరు వినిపిస్తుంది. అజిత్‌కు జోడీగా ఐశ్వర్య రాయ్ నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మేకర్స్ ఐష్‌తో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ ఆమె కనుక హీరోయిన్‌గా నటించడానికి అంగీకారం తెలిపితే.. అజిత్, ఐశ్వర్యల జోడీ 23ఏళ్ల తర్వాత రిపీట్ అవుతుంది. గతంలో ఈ జంట కలసి ‘ప్రియురాలు పిలిచింది’ లో నటించారు. ఈ చిత్రం 2000లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు క్లాసిక్‌‌గా నిలిచిపోయాయి. ‘ఏకే62’ లో అరవింద్ స్వామి, సంతానం కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - 2023-01-16T16:36:00+05:30 IST