Viral Video: సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యం.. రెండు బైక్‌లు, కుక్క భూమి లోపలికి.. వైరల్ వీడియో

ABN , First Publish Date - 2023-02-26T14:53:01+05:30 IST

మెట్రో నగరాలు, గ్రేటర్ సిటీలు కాంక్రీట్ జంగిల్స్‌లా మారిపోతున్నాయి. భూమి, మట్టి అనేది కనిపించకుండా మొత్తం రోడ్లు, సిమెంట్ కట్టడాలతో నిండిపోతున్నాయి. దీంతో వర్షం కురిసినపుడు నీరు పోవడానికి మార్గం లేక రోడ్లపైనే నిలిచిపోతోంది.

Viral Video: సీసీటీవీలో రికార్డైన షాకింగ్ దృశ్యం.. రెండు బైక్‌లు, కుక్క భూమి లోపలికి.. వైరల్ వీడియో

మెట్రో నగరాలు, గ్రేటర్ సిటీలు కాంక్రీట్ జంగిల్స్‌లా మారిపోతున్నాయి. భూమి, మట్టి అనేది కనిపించకుండా మొత్తం రోడ్లు, సిమెంట్ కట్టడాలతో నిండిపోతున్నాయి. దీంతో వర్షం కురిసినపుడు నీరు పోవడానికి మార్గం లేక రోడ్లపైనే నిలిచిపోతోంది. ఆ కారణంగా ఇటీవలి కాలంలో చాలా నగరాల్లోనూ రోడ్లు ఉన్నట్టుండి కుంగిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో (Delhi) అలాంటి ఘటనే జరిగింది. ఆ షాకింగ్ ఘటన సీసీటీవీ (CCTV Footage) కెమేరాలో రికార్డు అయింది.

Shocking Video: అసలు ఇది ఎలా సాధ్యం.. డైరెక్ట్‌గా పాలిథిన్ బ్యాగులోనే వండుతున్న బామ్మ.. వీడియో చూస్తే..

దక్షిణ ఢిల్లీలోని అర్కే పురం ప్రాంతంలో ఓ ఇరుకు సందులో రెండు బైక్‌లు పార్క్ చేసి ఉన్నాయి. ఆ బైక్‌ల మధ్యలో ఓ కుక్క పడుక్కుని ఉంది. ఉన్నట్టుండి ఆ రోడ్డు కుంగిపోయింది (Road Collapsed in Delhi). దీంతో బైక్, కుక్క లోపలికి వెళ్లిపోయాయి. కొద్ది సేపటికి మరో బైక్ కూడా పడిపోయింది. ఆ రోడ్డు కుంగిపోవడానికి కొన్ని సెకెన్ల ముందే ఓ వ్యక్తి అటుగా వాహనంపై వెళ్లాడు. అతడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.

ఈ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమేరాలో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆ రోడ్డును మళ్లీ మరమ్మత్తు చేయించామని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-02-26T14:53:03+05:30 IST