Restaurant Banned Smartphone: ఆ రెస్టారెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు బ్యాన్.. తినాలంటే ఫోన్‌ను పక్కన పెట్టేయాల్సిందే.. ఈ వింత రూల్ వెనుక..!

ABN , First Publish Date - 2023-04-05T16:15:49+05:30 IST

ఈరోజుల్లో సెల్‌ఫోన్ లేనివాళ్లు ఎవరున్నారు. బొడ్డూడని పిల్లోడి దగ్గర నుంచీ పెద్దలదాకా చేతిలో చరవాణి లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇక ఆన్‌లైన్ పేమెంట్ వచ్చాక ఆ వినియోగం మరింత పెరిగింది. దేన్నైనా మరిచిపోతారు గానీ.. ఫోన్ లేనిదే కాలు కూడా

Restaurant Banned Smartphone: ఆ రెస్టారెంట్‌లో స్మార్ట్‌ఫోన్లు బ్యాన్.. తినాలంటే ఫోన్‌ను పక్కన పెట్టేయాల్సిందే.. ఈ వింత రూల్ వెనుక..!
Restaurant Banned Smartphone

ఈరోజుల్లో సెల్‌ఫోన్ లేనివాళ్లు ఎవరున్నారు. బొడ్డూడని పిల్లోడి దగ్గర నుంచీ పెద్దలదాకా చేతిలో చరవాణి లేనిదే రోజు గడవని పరిస్థితి. ఇక ఆన్‌లైన్ పేమెంట్ వచ్చాక ఆ వినియోగం మరింత పెరిగింది. దేన్నైనా మరిచిపోతారు గానీ.. ఫోన్ లేనిదే కాలు కూడా బయటకు కదలదు. అంతగా ఫోన్‌తో జీవితం ముడిపడిపోయింది. దీని బట్టి చెప్పేయొచ్చు సెల్‌ఫోన్ యొక్క ప్రాముఖ్యత ఎంతుందో వేరే చెప్పనక్కర్లేదు. శరీరంలో అదొక భాగమనే చెప్పాలి. నేటి రాకెట్ యుగంలో పరిస్థితులు అంతలా మారిపోయాయి. కానీ అదేంటోగానీ... ఆ రెస్టారెంట్‌లోకి మాత్రం ఫోన్ తీసుకెళ్లకూడదంట. ఎందుకు..? ఆ లాజిక్ తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.

ఒకప్పుడు చందమామను చూపించో... లేదంటే ఏదొక పాట పాడో పిల్లలకు అన్నం తినిపించేశారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏ గొడవ చేయకుండా తినేసేలా పిల్లోడి చేతికే సెల్‌ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇక మొబైల్‌లో వీడియోలు చూస్తూ తినేస్తున్నారు. పెద్దల్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఏ పనిలో ఉన్నా మధ్య మధ్యలో ఫోన్ చేస్తూనే ఉంటారు. అంతగా దానితో కనెక్టివిటీ అయిపోయారు. అదే ఆ వ్యాపారికి విసిగి తెప్పించింది.

జపాన్ (Japan) రాజధాని టోక్యో (Tokyo) లో డెబుచాన్ పేరిట ఓ రెస్టారెంట్ (Restaurant) ఉంది. అక్కడికొచ్చే కస్టమర్లంతా తినేదాని కంటే టైంపాస్ చేసేవాళ్లే ఎక్కువగా కనిపించారంట. దీంతో ఆహారం చల్లారిపోవడం.. దాని రుచి తగ్గిపోవడం.. రద్దీ సమయాల్లో వెయిటింగ్ పెరిగిపోవడాన్ని నిర్వాహకులు గమనించారు. అంతే దీనంతటికీ కారణమైన సెల్‌ఫోన్‌ను బ్యాన్ చేయాలని రెస్టారెంట్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: Wedding Gift: హోం థియేటర్ పేలి వరుడు చనిపోయిన కేసులో షాకింగ్ ట్విస్ట్.. పెళ్లిలో ఆ బహుమతిని ఎవరు ఇచ్చారా అని ఆరా తీస్తే..

వడ్డించిన ఆహారాన్ని కస్టమర్లు నాలుగు నిమిషాల పాటు తినడం లేదని రెస్టారెంట్ యజమాని తెలిపారు. దీంతో ఆహారం చల్లారిపోతుందని చెప్పారు. తినకుండా ఫోన్‌లో వీడియోలు చూస్తూనే ఉండిపోతున్నారని.. ఆ సమయంలో నూడుల్స్ రుచి మారిపోతుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రద్దీ టైంలో సీట్లు లేక చాలా మంది బయట వేచి ఉండడం పెద్ద సమస్యగా మారిపోయిందని తెలిపారు. అందుకోసమే తినే సమయంలో సెల్ ఫోన్ వాడకాన్ని (Restaurant Banned Smartphone) నిషేధించినట్లు హోటల్ యాజమని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: అన్నీ రూ.500 నోట్ల కట్టలే.. దండగా కట్టుకుని మెడలో వేసుకుని.. విసిరేస్తున్నాడు.. ఎందుకిలా చేశాడంటే..!

ఇది కూడా చదవండి: Aadhaar Card New Rules: ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇకపై వీటిల్లో ఏ ఒక్కటి చేయాలన్నా..!

ఇది కూడా చదవండి: Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..

ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..

Updated Date - 2023-04-05T16:23:47+05:30 IST