ప్రియుడితో కలిసి భర్త జననాంగం కోసేందుకు ప్రయత్నించిన భార్య.. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ABN , First Publish Date - 2023-03-15T16:36:53+05:30 IST

హర్యానాకి చెందిన ఓ వ్యక్తి తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, తన దారికి అడ్డు తప్పుకోమని తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రియుడితో కలిసి భర్త జననాంగం కోసేందుకు ప్రయత్నించిన భార్య.. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..

హర్యానాకి (Haryana) చెందిన ఓ వ్యక్తి తన భార్యపై సంచలన ఆరోపణలు చేశాడు. తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం (Extra Marital Affair) ఉందని, తన దారికి అడ్డు తప్పుకోమని తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తను శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తే అంగీకరించడం లేదని, ప్రియుడితో కలిసి తన జననాంగాన్ని (Private Part) కట్ చేసేందుకు ప్రయత్నించిందని, తను తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డానని అతడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Crime News).

రేవారి జిల్లా బావల్ గ్రామానికి చెందిన మహిపాల్ అనే వ్యక్తి ఆరేళ్ల క్రితం శీతల్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండేళ్ల క్రితం పవన్ అనే వ్యక్తితో శీతల్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్తకు తెలిసి హెచ్చరించినా ఆమె వెనక్కి తగ్గకపోగా, బహిరంగంగానే ప్రియుడితో కలిసి తిరగడం ప్రారంభించింది. భర్తకు శారీరకంగా దూరమైంది. అంతేకాదు తన మార్గానికి అడ్డు రావొద్దని హెచ్చరించడం ప్రారంభించింది. మహిపాల్ నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా శీతల్ అంగీకరించలేదు. పైగా భర్తపై కోపం పెంచుకుంది (wife try to cut off her husband`s private part ).

పొట్టి దుస్తులు ధరించి బయటకు వెళ్లిందని భార్యపై భర్త ఆగ్రహం.. ఎంత చెప్పినా వినకపోవడంతో ఏం చేశాడంటే..

ఈ నెల 10వ తేదీన శీతల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి పవన్‌తో కలిసి నివసించడం ప్రారంభించింది. విషయం తెలుసుకున్న మహిపాల్ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అదే రోజు రాత్రి మహిపాల్ ఒంటరిగా ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. వారి వెనుక శీతల్ కూడా ఉంది. అందరూ కలిసి మహిపాల్ జననాంగాన్ని కత్తిరించేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో మహిపాల్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి. మహిపాల్ వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్యపై, అతడి ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

పెళ్లి రోజు వరుడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వధువు.. చివరి నిమిషంలో షాకిచ్చిన వరుడి తండ్రి.. ఏం చేయాలో తెలియక..

Updated Date - 2023-03-15T16:37:18+05:30 IST