YSRTP : రేవంత్ రెడ్డీ గుర్తుపెట్టుకో.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. రియాక్షన్ ఎలా ఉంటుందో..!

ABN , First Publish Date - 2023-03-06T23:13:13+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాత్ సే హాత్ జోడో యాత్రలో (Hath Se Hath Jodo Yatra) భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి సభలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి..

YSRTP : రేవంత్ రెడ్డీ గుర్తుపెట్టుకో.. వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు.. రియాక్షన్ ఎలా ఉంటుందో..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాత్ సే హాత్ జోడో యాత్రలో (Hath Se Hath Jodo Yatra) భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి సభలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ప్రస్తావిస్తున్నారు. టీడీపీలో (TDP) ఉన్నంతవరకూ వైఎస్‌ను తిట్టిపోసిన ఆయన.. ఉన్నట్టుండి వైఎస్ రాగం ఎత్తుకునే సరికి అందరూ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ నోట వైఎస్ మాట రావడంపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YSRTP Chief Sharmila) ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ మాట్లాడిన ప్రతిమాటను ప్రస్తావిస్తూ ట్వీట్ రూపంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏ ఎండకు.. ఆ గొడుగు..!

మహానేత YSR పాలన తెస్తా.. అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు YSRను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్‌కు YSR గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరుఅని రేవంత్‌కు షర్మిల ఒకింత వార్నింగ్ ఇచ్చారు.

రేవంత్ ఢిల్లీలో కాదు..!

ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్‌కు YSR అభిమానులే బుద్ధి చెప్తారు. YSR సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ YSR తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది YSR బిడ్డ మాత్రమే. మీరు దీక్ష చేయాల్సింది ఢిల్లీలో కాదు.. ప్రగతిభవన్ ముందు.. ఫామ్ హౌజ్ ముందు. బతుకమ్మ ఆడుతూ లిక్కర్ స్కామ్‌కు పాల్పడిన మీరు, మహిళలకే తలవంపు తెచ్చారు. ఇప్పుడు ఆ స్కాంను పక్కదారి పట్టించేందుకే ఈ కొత్త డ్రామాలుఅని రేవంత్‌పై ట్వీట్టర్‌లో షర్మిల తీవ్ర వ్యాఖలు చేశారు. ఈ కామెంట్స్‌పై రేవంత్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో ఏంటో వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-03-06T23:43:15+05:30 IST