Punganuru Incident : చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి నిజ స్వరూపం ఇదీ.. ఈ యువకుడి మాటలు ఒక్కసారి విన్నారో..!

ABN , First Publish Date - 2023-08-07T20:56:41+05:30 IST

చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి (Chittoor SP Rishanth Reddy).. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ వరకూ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.! ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!. ఇందుకు కారణం పుంగనూరులో జరిగిన విధ్వంసమే.!

Punganuru Incident : చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి నిజ స్వరూపం ఇదీ.. ఈ యువకుడి మాటలు ఒక్కసారి విన్నారో..!

చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి (Chittoor SP Rishanth Reddy).. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఢిల్లీ వరకూ ఓ రేంజ్‌లో వినిపిస్తోంది.! ఇక సోషల్ మీడియాలో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు!. ఇందుకు కారణం పుంగనూరులో జరిగిన విధ్వంసమే.! ఈ ఘటనను ఎదుర్కొన్న, సంయమనం పాటించి పోలీసులు ఎక్కడా రెచ్చిపోకుండా చూసిన వ్యక్తి రిశాంత్..! అని వైసీపీ వీరాభిమానులు చెప్పుకుంటున్నారు. ఇక నెట్టింట్లో అయితే.. ఆహా రిశాంత్.. ఓహో రిశాంత్ అని ఎస్పీని ఆకాశానికెత్తేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.! అంతటితో ఆగలేదు.. చిత్తూరు సింగం.. నువ్వే అసలు సిసలైన ఎస్పీ.. ఇన్నిరోజులు రీల్ లైఫ్‌లో చూశాం.. మొదటిసారి రియల్ లైఫ్‌లో చూస్తున్నాం అని తెగ కామెంట్స్ చేసేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఇంకొందరేమో అసలు ఎవరీ రిశాంత్.. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి..? ఇంతకుమునుపు ఎక్కడ పనిచేశారు..? ఈయన బ్యాగ్రౌండ్ ఏంటి..? అని గూగుల్ చేసే పనిలో పడ్డారు. అయితే.. ఓ యువకుడు చెప్పిన మాటలను చూసిన తర్వాత రిశాంత్ రెడ్డి అసలు రూపం బయటపడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


SP-Rishanth.jpg

2019లో అసలేం జరిగింది..?

2019లో రిశాంత్ రెడ్డి నర్సీపట్నం ఏఎస్పీగా పనిచేశారు. అయితే ఆ సమయంలో జరిగిన ఓ ఘటనను కళ్లకు కట్టినట్లుగా ఎల్లేటి సంతోష్ అనే యువకుడు మీడియాకు వెల్లడించారు. పుంగనూరు ఘటన తర్వాత అసలు రిశాంత్ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిది..? ఆయన సామాన్యుల పట్ల ఎలా ప్రవర్తించేవారు.. ఎలా ఇబ్బంది పెట్టేవారు..? అనే విషయాలను ఎస్పీ బాధితుడు మీడియా మీట్ ఏర్పాటు చేసి వెల్లడించారు.నా పేరు ఎల్లేటి సంతోష్.. నేను ఎస్పీ రిశాంత్ రెడ్డి బాధితుడిని. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చాను. ఎస్పీ రిశాంత్ రెడ్డి బాధితుడిని.. 2019 లో నర్సీపట్నం ఏఎస్పీగా రిశాంత్ రెడ్డి పని చేశారు. అప్పట్లో టీడీపీ బైక్ ర్యాలీలో పాల్గొన్నందుకు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. ఆ సమయంలో నన్ను కర్రలతో చితక బాదారు. తుపాకీ ముఖం మీద పెట్టి చంపుతానంటూ బూతులు తిట్టారు. మేడపై నుంచి కిందికి, పైకి పరుగులు పెట్టించాడు. ఆ సమయంలో పడిపోయి నా కాలు పూర్తిగా దెబ్బతిన్నది. ఆస్పత్రికి తరలించకుండా పిల్లల ఆసుపత్రికి పంపారు. అక్కడ చికిత్స చేయకపోవడంతో మా వాళ్లు మరో ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత నా కాళ్లు రెండూ దెబ్బ తిన్నాయి. ఈ విషయంలో రిశాంత్ రెడ్డిపై మీద కేసు పెట్టినా చర్యలు లేవు. కోర్టులో కేసు వేసినా.. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. తర్వాత మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తే పోలీసు శాఖ నుంచి రెండు లక్షలు పరిహారం ఇప్పించారుఅని సంతోష్ చెప్పుకొచ్చారు.

Elleti-Santhosh.jpg

అప్పుడే సస్పెండ్ చేసుంటే..?

పుంగనూరులో రిశాంత్ రెడ్డి దాడులు చూసి ఆవేదన కలిగింది. ఆయన పని తీరు 10 మందికి తెలియాలనే మీడియా ముందుకు వచ్చాను. నేను 2019లో ఫిర్యాదు చేసినప్పుడే చర్యలు తీసుకుని ఉంటే.. నేడు పుంగనూరులో ఇన్ని దారుణాలు జరిగేవి కావు. ఇప్పుడైనా రిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డీజీపీని కోరుతున్నాను. నాకు ఆయన నుంచి ప్రాణ హాని ఉంది.. నాకేం జరిగినా రిశాంత్ రెడ్డిదే బాధ్యత. సామాన్య ప్రజలను దూషించడం, కొట్టడం ఆయన నైజం. అటువంటి వ్యక్తి పోలీసు శాఖలో ఉండటానికి అనర్హుడు. నాకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని మీడియా ముందుకు వచ్చాను. పుంగనూరు ఘటనతో మళ్లీ నాలాగా చాలా మంది ఇబ్బంది పడకూడదనే నా ఆవేదనఅని చెబుతూ సంతోష్ కంటతడిపెట్టారు. కాగా.. పుంగనూరు ఘటనలో 62 మందిని అరెస్టు చేశామని ఏఎస్పీ శ్రీలక్ష్మి మీడియాకు వెల్లడించిన విషయం విదితమే.

sp-rishanth-reddy.jpg

ఎవరీ రిశాంత్..?

రిశాంత్ స్వగ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి. తల్లి పద్మావతి, తండ్రి గోపాల్‌రెడ్డి. హైదరాబాద్‌లో విద్యాబ్యాసం చేసిన రిశాంత్.. ఐఐటీ చదివి 2008లో ఫ్యూచర్స్‌ ఫస్ట్‌ అనే కంపెనీలో చేరారు. కానీ.. గూగుల్‌లో వెతికితే పేరు కనపడాలని.. గౌరవం పొందే ఉద్యోగం చేయాలని సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటిసారి మెయిన్స్‌లో ఫెయిల్, రెండోసారి ఇంటర్వ్యూ దాకా వెళ్లి వెనుదిరిగారు. మూడోసారి కూడా కూడా ఇలానే జరిగింది. 2016 నాలుగోసారి ప్రయత్నించి సివిల్స్‌‌లో 180వ ర్యాంకు సాధించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకుని ఏపీ క్యాడర్‌కు సెలక్ట్ అయ్యారు.

Jagan-And-Rishanth.jpg


ఇవి కూడా చదవండి


Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?


TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


JP Looking At YSRCP : ‘జేపీ’ వైసీపీలో చేరుతున్నారా.. ఎంపీగా బరిలోకి దిగుతున్నారా.. ఇందులో నిజమెంత..!?


Updated Date - 2023-08-07T20:59:01+05:30 IST