Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

ABN , First Publish Date - 2023-08-06T23:20:09+05:30 IST

‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్...

Governor Vs KCR : అసెంబ్లీ వేదికగా ధన్యవాదాలు చెప్పి మరీ.. గవర్నర్‌పై కేసీఆర్ ఇంత అక్కసు వెళ్లగక్కారేంటో..!?

‘ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే నానుడి గుర్తుంది కదా..! ఇది అక్షరాలా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు (CM KCR) సరిపోతుందేమో!. ఎందుకంటే.. గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్‌కు (Governer Vs CM KCR) మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయ్. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆమెకు పిలుపు వెళ్లదు.. రాజ్‌భవన్‌లో (Raj Bhavan) ఏం జరిగినా ఈయన వెళ్లరు..! అంతే మూడు నాలుగేళ్లుగా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గానే (Governor Vs Govt) పరిస్థితి ఉంది. అయితే.. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీన విషయంలో ‘విలీన బిల్లు’ను (TSRTC Merger Bill) కేబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్ ఆమోదం తప్పనిసరి కావడంతో ఈ రెండు మూడ్రోజులు సరిగ్గానే వ్యవహరించారు. తమిళిసై ఏ ప్రశ్నలు అడిగినా.. వివరణ ఇవ్వాలని ఎక్కడా బ్యాలెన్స్ కోల్పోకుండా ప్రభుత్వం ప్రవర్తించింది.! ఒకటికి, రెండుసార్లు సందేహాలు వ్యక్తపరిచినా సరే.. ఎంతో ఒపిగ్గా రాజ్‌భవన్‌కు సమాధానాలిచ్చింది కేసీఆర్ సర్కార్ (KCR Govt). ఆఖరికి బిల్లును గవర్నర్ ఆమోదించిన తర్వాత కేసీఆర్ అసలు రూపం బయటపెట్టారు.! ఎంతలా అంటే అసెంబ్లీ వేదికగా తమిళిసైను ఏక వచనంతో విమర్శించిన పరిస్థితి..!


CM-KCR-Assembly.jpg

అసలేం జరిగింది..?

ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నాలుగైదు రోజులుగా పెద్ద హైడ్రామానే నడిచిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, కార్మికులు (RTC Employees) రోడ్డెక్కడం.. ఆఖరికి రాజ్‌భవన్‌ను వద్ద నిరసన తెలిపే వరకూ వెళ్లారు. ప్రభుత్వానికి రెండు సార్లు లేఖ రాయడం.. సర్కార్ నుంచి సమాధానాలు, వివరణ వెళ్లడంతో ఆఖరికి ఆదివారం మధ్యాహ్నానికి బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ముందడుగు పడింది. ఇవాళ సాయంత్రం విలీన బిల్లును అసెంబ్లీలో కేటీఆర్ ప్రవేశపెట్టిగా.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించి.. నిశితంగా సభ్యులకు వివరించారు. అంతకుముందు సుదీర్ధంగా ప్రసంగించిన సీఎం కేసీఆర్.. ఆర్టీసీ బిల్లు, గవర్నర్ గురించి ప్రస్తావన తెచ్చారు. ఆర్టీసీ విలీనంపై కొందరు తెలిసీతెలియక మాట్లాడుతున్నారు. గవర్నర్ కూడా తెలియక వివాదం కొని తెచ్చుకుంది. గవర్నర్ పని లేని పని పెట్టుకుంది. క్లారిఫికేషన్ అడిగింది.. జ్ఞానోదయం అయింది.. బిల్లు ఆమోదం తెలిపింది. గవర్నర్‌కు ధన్యవాదాలు. గతంలో సమ్మె చేసి ప్రభుత్వంలో కలపమని ఉద్యోగులు, కార్మికులు కోరారు. గతంలో వద్దనుకున్నం.. సంస్థ మనుగడ సాధించే పరిస్థితి లేదు. దాన్ని ప్రభుత్వమే సాకాలి. ఇన్నాళ్లు అది ప్రభుత్వంలో లేదన్నట్లే కానీ రూ.1500 కోట్లు ఇచ్చి దాన్ని ప్రభుత్వమే సాదుతుంది. రవాణా సౌకర్యం ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. కొందరు దుర్మార్గులు ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినం.. అని మాట్లాడుతున్నారు. ఇలాంటివి వింటే బాదేస్తుంది అని కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు.

KCR-And-Governer.jpg

ఇదేందయ్యా ఇది..!

చూశారుగా.. విలీన బిల్లును ఆమోదించక ముందు కేసీఆర్‌తో పాటు మంత్రులుగానీ, ఆర్టీసీ సంఘాల నేతలు కానీ ఎక్కడా నోరు మెదపలేదు..! కనీసం చిన్నపాటి విమర్శ చేయడానికి కూడా సాహసించలేదు.! సీన్ కట్ చేస్తే.. తమిళిసై అలా ఆమోదం తెలిపారో లేదో.. అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అది కూడా.. గవర్నర్ అనే కనీస గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడటం ఎంతవరకు సమంజసమో గులాబీ బాస్‌కే తెలియాలి. కేసీఆర్ ప్రసంగం విన్న ప్రతిపక్షాలు, సామాన్య ప్రజలు.. సారేంటి ఇలా మాట్లాడారేంటని ఆశ్చర్యపోతున్నారు. గవర్నర్ ఆమోదం కావాలని అడిగారు.. అయ్యింది అంతే కదా.. మళ్లీ ఈ అక్కసేంటి సారూ..! అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. అయితే.. కేసీఆర్ సర్కార్‌ నుంచి ఎలాంటి విమర్శలు వచ్చినా సరే.. మీడియా మీట్ లేదా.. సోషల్ మీడియా ద్వారా రియాక్టయ్యి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే గవర్నర్.. ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైన చెప్పిన ఆ సామెత కేసీఆర్‌కు ఎలా సెట్ అవుతుందో అర్థమైంది కదా..!

Tamilisai-And-KCR.jpg


ఇవి కూడా చదవండి


Gaddar No More : గద్దర్ చివరి మాటలు గుర్తు చేసుకొని గుండెలవిసేలా రోదించిన విమల..!



TS Politics : అసెంబ్లీలో కేసీఆర్ ఎన్నికల హామీలు.. అన్నీ శుభవార్తలే చెప్పిన సీఎం!


Gaddar Passes Away : ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూత.. అరుదైన ఫొటోలు


#RIP Gaddar : విమల సూచనతో గద్దర్ అంత్యక్రియలు అక్కడే.. రేపు సెలవు..!?


Gaddar Last Rites : కేసీఆర్ కీలక నిర్ణయం.. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు


Gaddar And Pawan : తమ్ముడా.. అని పవన్‌ను గద్దర్‌ చివరిసారిగా పలకరించి ఏం చెప్పారంటే..?


Updated Date - 2023-08-06T23:25:49+05:30 IST