TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!

ABN , First Publish Date - 2023-07-06T22:11:25+05:30 IST

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు..

TS Politics : బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఊహించని షాక్.. త్వరలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు బిగ్ షాట్‌‌లు..!

తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) గంట గంటకూ మారిపోతున్నాయ్.. ఎప్పుడు ఏ నేత సొంత పార్టీకి గుడ్ బై చెప్పి.. వేరే పార్టీలో చేరతారో..? అర్థం కాని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ నుంకాంగ్రెస్, బీజేపీలోకి.. బీఆర్ఎస్, బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress) ఇలా నేతలు జంపింగ్‌లు షురూ చేసేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు, ముఖ్య నేతలు కండువాలు మార్చేయగా.. మరికొందరు క్యూలో ఉన్నారు. త్వరలోనే బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా రాబోతుండటం.. సిట్టింగుల్లో సుమారుగా 30 మందిని దాకా మార్చే యోచనలో గులాబీ బాస్ కేసీఆర్ ఉన్నారని వార్తలు రావడం.. మరోవైపు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ను (Bandi Sanjay) తొలగించి కిషన్ రెడ్డిని (Kishan Reddy) నియమించడం.. ఈ రెండు పరిణామాలతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే బీజేపీ, బీఆర్ఎస్‌లోని అసంతృప్తులు కొందరు.. టికెట్ దక్కదని తెలుసుకున్న మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఇందులో ముగ్గురు బిగ్ షాట్‌లు ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదేగానీ జరిగితే కాంగ్రెస్‌‌కు మంచిరోజులేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు..? ఎందుకు కాంగ్రెస్‌నే ఎంచుకుంటున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

T-Congress.jpg

ఇదీ అసలు కథ..

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న వేళ.. తమకు ఏ పార్టీలో ఉంటే టికెట్ దక్కుతుంది..? టికెట్ వచ్చినా ఏ మేరకు గెలుపు అవకాశాలున్నాయ్..? క్యాడర్ పరిస్థితి ఎలా ఉంది..? మునుపటిలాగే గెలిపించి అసెంబ్లీకి పంపిస్తుందా..? లేకుంటే తారుమారయ్యే ఛాన్స్ ఉందా..? ఏ పార్టీ తరఫున పోటీచేస్తే కలిసొస్తుంది..? అని అన్నీ బేరీజు చేసుకుని సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలక నేతలు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు టికెట్ హామీ ఇవ్వకపోవడం, కన్నతల్లి లాంటి పార్టీని వదులుకుని పార్టీ మారినా సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తికి లోనైన ఇద్దరు బీజేపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి (Enugu Ravinder Reddy), మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) , కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ చెందిన పలువురు అసంతృప్త నాయకులు ఆ పార్టీని వీడివెళ్లగా.. మరికొంతమంది నేతలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

Enugu.jpg

కాంగ్రెస్‌లోకే ఎందుకంటే..?

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajender) ప్రధాన అనుచరుడు, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి ఈ ఇద్దరూ త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్న మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావుతో (Jupally Krishna Rao) టచ్‌లోకి వెళ్లారు. నమ్మివచ్చినా ఈటల తనకు న్యాయం చేయలేదని.. ఏనుగు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని యెన్నం అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలోనే జూపల్లితో భేటీ కావడం, కాంగ్రెస్‌లోకి ఆ ఇద్దర్నీ ఆహ్వానించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల కిందటి నుంచీ ఈ ఇద్దరూ బీజేపీలో కొనసాగుతూ ఈటల వెంటే నడుస్తున్నారు. ఈ ఇద్దరూ పార్టీ వీడితే బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాటు.. ఈటలకు కూడా వ్యక్తిగతం పెద్ద దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి.. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా తెలంగాణ బీజేపీలో సీన్ మారిపోవడం, దీనికి తోడు అధ్యక్షుడి మార్పు ఇవన్నీ .. నిన్న మొన్నటి వరకూ బీఆర్ఎస్‌తో టఫ్ వార్ అనే పరిస్థితి నుంచి.. ఇప్పుడు థర్డ్ ప్లేస్‌కు పడిపోగా.. ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు నేతలను కాపాడుకోలేని స్థాయికి బీజేపీ చేరిందన్న మాట. వీరితో పాటు మాజీ మంత్రి, బీజేపీ మహిళా నాయకురాలు డీకే అరుణ ప్రధాన అనుచరుడు పవన్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరే రోజే ఈ ముగ్గురు భారీ బహిరంగ సభావేదికగా ప్రియాంక గాంధీ సమక్షంలో కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే వీళ్లు ఆశించిన స్థానాల్లో టికెట్లు ఇవ్వలేకపోయినా సర్దుబాటు చేస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.

Yennam.jpg

నేను సైతం కాంగ్రెస్‌లోకే..!

రానున్న ఎన్నికల్లో మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోతే తాను పార్టీని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తేల్చిచెప్పేశారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన సబితాఇంద్రారెడ్డికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. టీడీపీలో ఉన్నపుడే తనకు పదవులు లభించాయని, బీఆర్‌ఎస్‌లో ఏ పదవీ దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను జైల్లో పెట్టించిన సబితకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఈసారి మహేశ్వరం నియోజకవర్గం నుంచి తనకే బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తనకు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడంలేదని, ఎన్నికల్లో ఓడిపోతే దూరం పెడతారా..? అంటూ ప్రశ్నించారు. ఈసారి సిటింగులకే పార్టీ టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటిచడంతో తీగల కృష్ణారెడ్డి కాంగ్రె‌స్‌లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీలో పనిచేసిన కాలంలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy)తో ఉన్న పరిచయం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుంటే తీగల కృష్ణారెడ్డి కాంగ్రె‌స్‌లోనే చేరతారన్న ప్రచారం స్థానికంగా జోరందుకుంది. ఇప్పటికే తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం కావడం భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయానికొచ్చాకే రేవంత్‌తో టచ్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి గెలిచి సబిత బీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో ప్రస్తుతం కాంగ్రెస్‌కు క్యాడర్ ఉంది కానీ సరైన నేత ఎవరూ లేరన్నది జగమెరిగిన సత్యమే. ఇప్పుడు తీగల పార్టీలోకి వస్తే ఆయన క్యాడర్‌కు కాంగ్రెస్ క్యాడర్‌ తోడైతే ఇక మహేశ్వరంలో జెండా ఎగురుతుందని అధిష్టానం ధీమాగా ఉందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ప్రియాంక గాంధీ సమక్షంలోనే తీగల కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని తెలియవచ్చింది.

Teegala.jpg

మొత్తానికి చూస్తే.. బీఆర్ఎస్‌లోకి సిట్టింగ్‌లకే సీట్లనే టాక్, కమలంలో కల్లోల్లం.. కాంగ్రెస్‌కు బాగానే కలిసొస్తోందని చెప్పుకోవచ్చు. ఎన్నికల ముందే సీన్ ఇలా ఉంటే.. జులై చివరికి పరిస్థితులు మరోలా ఉంటాయని.. భారీగా కాంగ్రెస్‌లోకి చేరికలు ఉంటాయని ఆ పార్టీ ముఖ్యనేతలు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ తొలి జాబితా రిలీజ్ అయ్యాక కాంగ్రెస్‌కు ఇక అన్నీ మంచిరోజులేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మున్ముందు ఇంకా ఏమేం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి


Ponguleti Meets YS Jagan : తాడేపల్లి ప్యాలెస్‌కు చేరిన తెలంగాణ రాజకీయాలు.. సీఎం జగన్‌తో పొంగులేటి భేటీ.. షర్మిల గురించే చర్చ..!


Kishan Reddy : ‘బండి’ని తప్పించి మరీ కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇవ్వడం వెనుక ఇంత కథుందా.. అది కూడా రెండోసారి..!?


TeluguDesam : ఎన్డీఏ మీటింగ్‌కు టీడీపీ.. తర్వాత జరగబోయేది ఇదేనా..?


Telangana BJP : ‘బండి’ని తప్పించాక యమా స్పీడ్‌ మీదున్న ఈటల.. ఈ అస్త్రాలన్నీ ప్రయోగించబోతున్నారా..!?


Updated Date - 2023-07-06T22:20:41+05:30 IST