TS Cabinet : ఇంకా జ్వరంతోనే సీఎం కేసీఆర్.. కేబినెట్ భేటీ వాయిదా

ABN , First Publish Date - 2023-09-28T21:48:20+05:30 IST

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (TS CM KCR) ఇంకా జ్వరంతోనే (KCR Fever) బాధపడుతున్నారు. గతవారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న గులాబీ బాస్..

TS Cabinet : ఇంకా జ్వరంతోనే సీఎం కేసీఆర్.. కేబినెట్ భేటీ వాయిదా

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (TS CM KCR) ఇంకా జ్వరంతోనే (KCR Fever) బాధపడుతున్నారు. గతవారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న గులాబీ బాస్.. ఇంకా జ్వరం నుంచి కోలుకోలేదు. దీంతో శుక్రవారం నాడు (సెప్టెంబర్-29న) జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. అయితే మళ్లీ ఎప్పుడు సమావేశం ఉంటుందనే విషయంపై క్లారిటీ లేదు. అక్టోబర్ మొదటివారంలో కేబినెట్ భేటీ (TS Cabinet Meeting) ఉండే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.


CM-KCR-1.jpg

ఒకవేళ భేటీ ఉండుంటే..?

ఒకవేళ కేబినెట్ భేటీ జరిగి ఉంటే.. పలు కీలక విషయాలపై చర్చించాలని కేసీఆర్ భావించారు. ముఖ్యంగా.. అక్టోబర్ రెండోవారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీనిపై ప్రధానంగా చర్చ జరిగేది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావించినట్లు తెలియవచ్చింది. అంతేకాకుండా గవర్నర్ తమిళిసై.. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల తిరస్కరణపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగేది. అంతేకాదు.. వేరేవారిని నామినేట్ చేయాలా? లేదా గవర్నర్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్లాలా? అనే దానిపై చర్చ జరిగేదని తెలుస్తోంది. గవర్నర్ కోటా కింద ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తమిళిసై తిరస్కరించడంపెద్ద వివాదానికే దారి తీసింది. దీనిని బీఆర్ఎస్ పెద్దలు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా తమిళిసై టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె పనిచేశారని, అలాంటి వారిని గవర్నర్‌గా నియమించవచ్చా? అంటూ మంత్రులు, ముఖ్యనేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో మళ్లీ గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్‌గా పరిస్థితులు మారిపోయాయి.

governor-tamilisai.jpg

ఇదే చివరి సమావేశమా..?

మరీ ముఖ్యంగా.. ఎన్నికల నేపథ్యంలో మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఓ వైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరిట మినీ మేనిఫెస్టోను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుండటంతో.. ఇక అధికార బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై రాష్ట్ర ప్రజల దృష్టి పడింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశముండటంతో.. ఇదే చివరి కేబినెట్ సమావేశం అవుతుందనే చర్చ కూడా పెద్ద ఎత్తునే జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే నెల దసరా తర్వాత నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నట్లు సమాచారం. వచ్చే నెలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టోను ప్రకటించేందుకు కేబినెట్ భేటీలో చర్చించాలని కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి


TS Politics : బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు


Jagan Adani : వైఎస్ జగన్ రెడ్డితో అదానీ భేటీ.. ప్రేమతో ఈసారి బిగ్ డీల్..!?


YuvaGalam : నాన్నకు ప్రేమతో.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా


CBN Case : చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టేందుకు జగన్ సర్కార్ మరో కుట్ర..!


Updated Date - 2023-09-28T21:49:37+05:30 IST