Share News

CBN Release : జైలు నుంచి చంద్రబాబు విడుదల.. బయటికి ఎలా వచ్చారో చూడండి..

ABN , First Publish Date - 2023-10-31T16:21:46+05:30 IST

అవును.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు అక్రమం..! అరెస్టు అంతకుమించి అక్రమం..! అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్‌కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని తెలుగు ప్రజలు భావించారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు..

CBN Release : జైలు నుంచి చంద్రబాబు విడుదల.. బయటికి ఎలా వచ్చారో చూడండి..

అవును.. టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు అక్రమం..! అరెస్టు అంతకుమించి అక్రమం..! అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్‌కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని తెలుగు ప్రజలు భావించారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు. కానీ.. ఇవేవీ జరగలేదు. చంద్రబాబు నిర్బంధానికి శనివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఆయనను స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో సెప్టెంబర్-09న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజున ఏసీబీ కోర్టు ఆయనను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి ఆయన రాజమహేంద్రవరం జైల్లోనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు... జైలువాసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన రెండు మూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అందరూ అనుకున్నారు కానీ.. 53 వ రోజు వరకూ రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబు ఉండాల్సి వచ్చింది. మంగళవారం నాడు జైలు నుంచి చంద్రబాబు ‘విడుదల’ అయ్యారు. వచ్చీ రాగానే.. టీడీపీ శ్రేణులు, తెలుగు ప్రజలకు అభివాదం చేస్తూ, విక్టరీ సింబల్ చూపించారు. మనవడు దేవాన్ష్‌ను ముద్దాడి కాన్వాయ్ ఎక్కారు.బాబు రాకతో టీడీపీ శ్రేణులు, వీరాభిమానులు, తెలుగు ప్రజల్లో ఎనలేని సంతోషం వచ్చింది.


బాబు వచ్చేశారోచ్..!

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రావడంతో బాబు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని టీడీపీ శ్రేణులు, వీరాభిమానులు వేయి కళ్లతో ఎదురుచూపులు చూస్తున్నారు. మొదట సాయంత్రం నాలుగు గంటలకే రిలీజ్ అవుతారని భావించినప్పటికీ అది ఇంకాస్త ఆలస్యం అయ్యింది. మరికొన్ని నిమిషాల్లో.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటికి వస్తారన్న టైమ్‌లో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు.రాజమండ్రి జైలు నుంచి బయటికి రాగానే.. నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఇవాళ రాత్రికి చంద్రబాబు విజయవాడకు రానున్నారు. బుధవారం సాయంత్రానికి బాబు తిరుమల చేరుకోనున్నారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరుమల నుంచి హైదరాబాద్ వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో చంద్రబాబు పరీక్షలు, చికిత్సలు చేయించుకుంటారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నాయి.

అంతకు ముందు ఏం జరిగింది..?

  • చంద్రబాబు కాన్వాయ్‌లో ఒక్క వాహనాన్ని మాత్రమే జైలు మెయిన్ గేటు వద్దకు అనుమతించిన పోలీసులు

  • జైలు మెయిన్ గేటు వద్దకు తమను అనుమతించాలని మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, ఇతర నేతల పట్టు

  • కుదరదని బయటే నిలిపివేసిన పోలీసులు

  • పోలీసులతో గొడవపడిన అచ్చెన్నాయుడు, ఇతర మాజీ మంత్రులు

  • మరోవైపు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో మాట్లాడి బయటకొచ్చిన నారా లోకేష్, బ్రాహ్మణి

  • రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్న నందమూరి బాలకృష్ణ, వసుందర, లోకేష్ తనయుడు దేవాన్ష్

  • రాజమండ్రి సెంట్రల్ వద్ధ తోపులాట

  • టీడీపీ నేతలను ఎక్కడికక్కడ వెనక్కి నెట్టేసిన పోలీసులు

  • అతి కష్టం మీద చంద్రబాబు కాన్వాయ్‌తో పాటు మరో వాహనాన్ని లోపలికి పంపిన పోలీసులు

  • అన్ని వాహనాలను లోపలకి పంపితే కార్యకర్తలు కూడా జైలు లోపలికి వెళ్ళిపోతారని భయపడిన పోలీసులు

  • సరిగ్గా 4:16 గంటలకు జైలు నుంచి విడుదలైన చంద్రబాబు

  • జైలు నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చిన చంద్రబాబు

  • జైలు నుంచి బయటికొస్తూ టీడీపీ శ్రేణులు, అభిమానులు, తెలుగు ప్రజలకు చంద్రాబాబు అభివాదం

  • మనవడు దేవాన్ష్‌ను ముద్దాడిన చంద్రబాబు

  • బాలయ్య, అచ్చెన్నతో పాటు ముఖ్యనేతలను ఆలింగనం చేసుకున్న చంద్రబాబు

  • రాజమండ్రి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు రాత్రికి రానున్న చంద్రబాబు

  • రేపు సాయంత్రానికి తిరుమల చేరుకోనున్న చంద్రబాబు

  • ఎల్లుండి ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న చంద్రబాబు

  • అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్లి వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు, చికిత్సలు చేయించుకుంటారని పేర్కొన్న టీడీపీ

Updated Date - 2023-10-31T16:33:05+05:30 IST