Share News

Actor Naresh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన నటుడు నరేష్.. ఏం అన్నారంటే..?

ABN , First Publish Date - 2023-10-18T17:55:18+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అంశంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. తాను ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడాలని భావించడం లేదని.. అయితే ధర్మం ఎప్పుడూ నిలబడుతుందని నరేష్ అన్నారు.

Actor Naresh: చంద్రబాబు అరెస్టుపై స్పందించిన నటుడు నరేష్.. ఏం అన్నారంటే..?

ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు అరెస్ట్ గురించి రకరకాలుగా స్పందనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కక్షపూరితంగానే కేసులపై కేసులు నమోదు చేస్తూ ఉక్కిరిబిక్కిర చేస్తోందని టీడీపీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది స్పందించారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్, మురళీమోహన్ లాంటి వాళ్లు చంద్రబాబు అరెస్టును ఖండించారు. తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారు. సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్‌లలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ అభిప్రాయమేంటని జర్నలిస్టులు అడగ్గా నరేష్ తన స్పందన తెలియజేశారు.

ఇది కూడా చదవండి: CBN Case : క్వాష్ పిటిషన్‌పై చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే..!

తాను ప్రత్యేకంగా ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడాలని భావించడం లేదని.. అయితే ధర్మం ఎప్పుడూ నిలబడుతుందని నరేష్ అన్నారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుందని స్పష్టం చేశారు. దీంతో ఆ తిరుగుబాటు ఫలితం తప్పకుండా వస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో ఇందిరాగాంధీ హయాంలో దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందని.. ఆ ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని చాలామంది నాయకులు జైల్లో ఉన్నారని నరేష్ గుర్తుచేశారు. తర్వాత ఏమైందో అందరికీ తెలుసని.. ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నరేష్ అన్నారు. రాజకీయంగా వారసులు రావడం కరెక్టో.. కాదో తాను చెప్పలేనని తెలిపారు. అయితే నాయకులు సరిగ్గా పనిచేస్తే తప్పకుండా విలువ ఉంటుందన్నారు. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయం అనేది డబ్బుతోనే ముడిపడి ఉందన్నారు. ఈ ముడిని విప్పడం ప్రజల చేతుల్లోనే ఉందని నరేష్ చెప్పారు. అటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపైనా నరేష్ స్పందించారు. సినిమా పరిశ్రమకు చెందిన పవన్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టి పోరాటం చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నట్లు నరేష్ వెల్లడించారు.

Updated Date - 2023-10-18T17:55:18+05:30 IST