Rahul Sipligunj: గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ టాలీవుడ్ సింగర్.. నిజం ఇదిగో..!!

ABN , First Publish Date - 2023-08-26T13:49:24+05:30 IST

మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నవంబర్‌లో నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు గాంధీ భవన్‌లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు.

Rahul Sipligunj: గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ టాలీవుడ్ సింగర్.. నిజం ఇదిగో..!!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో రాజకీయ పార్టీలు సీట్లు ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ 116 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. అటు కాంగ్రెస్ కూడా పలు నియోజకవర్గాల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఖరారు చేసే బిజీలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారని మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమాకు గానూ ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాట పాడి ఒక్కసారిగా రాహుల్ సిప్లిగంజ్ ఫేమస్ అయిపోయాడు. బుల్లితెరపై బిగ్ బాస్ షోలో కూడా పాల్గొన్నాడు. నటుడిగా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా రాణిస్తున్న రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరో మూడు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. నవంబర్‌లో నోటిఫికేషన్.. డిసెంబర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గోషామహల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ చేస్తారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు గాంధీ భవన్‌లో అతడు దరఖాస్తు చేసుకున్నాడని గత రెండు రోజులుగా మీడియాలో పలు కథనాలు ప్రసారం అయ్యాయి. దీంతో తన పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ స్వయంగా స్పందించాడు. తాను అసలు రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తాను ఏ పార్టీ తరఫున పోటీ చేయడం లేదని.. తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పాడు.


కాగా పాతబస్తీకి చెందిన సిప్లిగంజ్‌కు స్థానికంగా మంచి క్రేజ్ ఉంది. యూట్యూబ్‌లో అతడు పాడిన పలు పాటలు విశేష ప్రజాదరణ పొందాయి. బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ ఆర్.ఆర్.ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటతో విశ్వవ్యాప్తంగా క్రేజ్ సంపాదించాడు. అతడి క్రేజ్ ఉపయోగించుకునేందుకు పలు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గ టిక్కెట్‌ను రాహుల్ సిప్లిగంజ్‌కు కేటాయించిందని రూమర్స్ వినిపించాయి. ప్రస్తుతం ఇదే నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్‌కు వెళ్తారని ప్రచారం జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో పాపులారిటీ ఉన్న రాహుల్ సిప్లిగంజ్‌ను బరిలోకి దింపుతుందని వార్తలు వచ్చాయి.

అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ట్విట్టర్ వేదికగా రాహుల్ సిప్లిగంజ్ ఖండించాడు. తాను కళాకారుడినని, ప్రజలను ఎంటర్‌టైన్ చేయడమే తనకు తెలుసునని స్పష్టం చేశాడు. దీనినే భవిష్యత్‌లోనూ కొనసాగిస్తానని చెప్పాడు. తాను రాజకీయాల్లోకి వస్తానని పలు యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌లో వస్తున్న వార్తలు ఎలా వచ్చాయో తెలియదని అన్నాడు. ప్రస్తుతం తన దృష్టి మ్యూజిక్ కెరీర్ మీదే ఉందన్నాడు. రాజకీయాలలోకి రావాలని, తాను వస్తానని ఏ పార్టీని, రాజకీయ నాయకుడిని సంప్రదించలేదని వెల్లడించాడు. ఏ పార్టీ కూడా తనను వాళ్ల పార్టీలో చేరాలని అడగలేదని.. దయచేసి ఇలాంటి పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టాలని రాహుల్ సిప్లిగంజ్ కోరాడు.

Updated Date - 2023-08-26T13:49:24+05:30 IST