Pawan Kalyan: పథకాలకు పేర్లు మార్చడం కాదు.. జగన్ ఇక్కడ బటన్ నొక్కు

ABN , First Publish Date - 2023-07-10T18:40:01+05:30 IST

ఏలూరు జిల్లాలో వారాహి విజయ యాత్ర రెండో విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి పంచ్ ఇచ్చారు. ‘చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్’ అంటూ కళ్యాణ్ మండిపడ్డారు.

Pawan Kalyan: పథకాలకు పేర్లు మార్చడం కాదు.. జగన్ ఇక్కడ బటన్ నొక్కు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్‌ (Jagan)కు జనసేన పార్టీ (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి పంచ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలి. 300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్’ అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలతో జగన్‌పై సోషల్ మీడియాలో మరోసారి విమర్శల వర్షం కురుస్తోంది. బటన్ నొక్కుడు సీఎం అని.. బటన్ పనిచేయడం లేదని పలువురు ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం వాలంటీర్లను రెచ్చగొట్టి ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేయిస్తోందని.. విమర్శలకు జవాబులు చెప్పలేని ఈ ప్రభుత్వం ఎదురుదాడులకు దిగడం సిగ్గుచేటు అని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 2024లో ఇంటికి వెళ్లడం ఖాయమని .. లేకపోతే ఏపీ మరింత సర్వనాశనం కావడం ఖాయమని పలవురు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏలూరు జిల్లాలో వారాహి విజయ యాత్ర రెండో విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంంగా ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ ఎక్కడి నుంచో ఊడి పడలేదు.. మన కంటే ఎక్కువా కాదు. ప్రజల్లో ఒకడు. మనం స్వేదం చిందించి కట్టిన పన్నులకు ధర్మకర్తగా ఉండాలని మాత్రమే ఆయనను నమ్మి బాధ్యతలు అప్పగించాం. దానిని జగన్ నిలబెట్టుకోలేకపోయారు’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలకు తెలియకుండానే రూ.1.18 లక్షల కోట్ల అప్పు చేసి దానికి కనీసం లెక్కలు కూడా సరిగా చెప్పని జగన్ సీఎం పదవికి పూర్తిగా అనర్హుడు అని పవన్ స్పష్టం చేశారు. జగన్ పాలనలో వ్యవస్థల విచ్ఛిన్నం, చట్టాల ఛిన్నాభిన్నం అవుతున్న తీరు చూశాక ఇక నుంచి జగన్ అని ఏకవచనంతోనే సంబోధిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే జగన్ ఇతర పార్టీల పథకాల పేర్లు మార్చి తాను గొప్పగా చెప్పుకోవడంపై ఏపీ వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారని ఆయన అభిమానులు ఆరోపణలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Revanth Reddy : తానా సభలో రేవంత్ కీలక వ్యాఖ్యలు

SuperStarKrishna: అది స్థాపించి ఈరోజుకి 53 ఏళ్ళు, వైరల్ అవుతున్న అప్పటి ఫోటోస్

Updated Date - 2023-07-10T18:42:14+05:30 IST