KCR vs Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో సేమ్ సీన్ రిపీట్.. సీఎస్ శాంతికుమారి పక్కన ఉండగానే..

ABN , First Publish Date - 2023-01-26T21:22:20+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై (KCR vs Tamilisai) ఎపిసోడ్‌కు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతోందని..

KCR vs Tamilisai: తెలంగాణ రాజ్‌భవన్‌లో సేమ్ సీన్ రిపీట్.. సీఎస్ శాంతికుమారి పక్కన ఉండగానే..

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో (Telangana Politics) సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళిసై (KCR vs Tamilisai) ఎపిసోడ్‌కు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కనిపించడం లేదు. వీరిద్దరి మధ్య గ్యాప్ కొనసాగుతోందని ‘రిపబ్లిక్ డే’ (Republic Day 2023) వేడుకలు జరిగిన తీరు మరోసారి రుజువు చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో (Raj Bhavan) ఎట్ హోమ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు (BRS) దూరంగా ఉన్నారు.

ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Telangana CS Shanti Kumari) హాజరయ్యారు. డీజీపీ అంజనీకుమార్‌, పలువురు అధికారులు, బండి సంజయ్‌, కాసాని జ్ఞానేశ్వర్‌ కూడా హాజరు కావడం గమనార్హం. రాజ్‌భవన్‌లో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు కూడా సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ మాత్రమే హాజరు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్ పరేడ్ గ్రౌండ్‌కు వెళ్లి అమర వీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.

CS.jpg

జాతీయ ప్రాధాన్యం ఉన్న పండగల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని.. కొవిడ్‌కు ముందు ఎలా నిర్వహించారో అలాగే ఘనంగా పరేడ్‌తో సహా గణతంత్ర వేడుకలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసినప్పటికీ తెలంగాణలో గణతంత్ర దినోత్సవం ఎవరిక వారే యమునా తీరే అన్నట్టుగా సాగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రిపబ్లిక్‌ డే వేడుకలకు ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు? గవర్నర్‌గా ఎవరు ఉన్నారు? అనే అంశంతో సంబంధం లేదని.. 1950 నుంచి ఎలా జరుగుతున్నాయో అలాగే జరపాలని కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఆ దిశగా అడుగులుపడకపోవడం గమనార్హం. ఈ మొత్తం పరిణామాలు గవర్నర్, సీఎం మధ్య మరింత దూరం పెంచాయి.

CS1.jpg

తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనలు, కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి నివేదిక ఇచ్చినట్లు గవర్నర్ స్వయంగా వెల్లడించారు. ‘ఐదు లక్షల మందితో కేసీఆర్ బహిరంగ సభ పెట్టారు.. ఖమ్మం సభకు లేని కరోనా రిపబ్లిక్ డేకు గుర్తుకొచ్చిందా?’ అని పుదుచ్చేరి గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు సీఎం వర్సెస్ గవర్నర్ ఎపిసోడ్‌లో ఏ స్థాయి తీవ్రత ఉందో చెప్పకనే చెప్పేశాయి. రెండేళ్ల నుంచి రాజ్‌భవన్‌పై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. ప్రభుత్వం రాజ్యాంగ విలువలు పాటించడం లేదని తమిళిసై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాక రేపాయి. గవర్నర్ వ్యాఖ్యలు బాధాకరమని, రాజ్యాంగ హోదాలో ఉండి ఇవాళ అలా మాట్లాడడం సరికాదని బీఆర్‌ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తప్పుబట్టారు. గవర్నర్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని, సీఎస్, డీజీపీని పక్కన పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమేంటని తలసాని చేసిన వ్యాఖ్యలు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

Updated Date - 2023-01-26T21:25:11+05:30 IST