DS Resignation : డీఎస్ రాజీనామా సంతకం ఫేక్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ధర్మపురి సంజయ్..

ABN , First Publish Date - 2023-03-27T18:27:16+05:30 IST

తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas) కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా (Resignation) చేసిన సంగతి తెలిసిందే...

DS Resignation : డీఎస్ రాజీనామా సంతకం ఫేక్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ధర్మపురి సంజయ్..

తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Dharmapuri Srinivas) కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి (Congress Party) రాజీనామా (Resignation) చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు గాంధీ భవన్‌ వేదికగా డీఎస్, ఆయన కుమారుడు ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) ఇద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. డీఎస్ చేరికతో కాంగ్రెస్ పెద్దలు, పార్టీ శ్రేణులు, ఆయన అనుచరులు, అభిమానులు ఆనందంలో మునిగి తేలారు. అయితే.. ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. 24 గంటల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డీఎస్ ప్రకటించారు. తనకు ఆరోగ్యం సహకరించట్లేదని.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. అయితే.. కాంగ్రెస్‌లో డీఎస్ చేరిక, రాజీనామా వ్యవహారంపై ధర్మపురి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్లాక్ మెయిల్ చేసి ఇలా..!

డీఎస్‌పై కుట్ర జరుగుతోంది. డీఎస్‌కు ప్రాణహాని ఉంది. నాన్న చుట్టూ ఉన్న వాళ్లపై నాకు అనుమానం ఉంది. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్. నాన్నను రూమ్‌లో బంధించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. మా నాన్నతో నా ఫోన్ లిఫ్ట్ చేయించడం లేదు. ఏం జరుగుతోందో తెలియక మాకు ఆందోళనకరంగా ఉంది. రౌడీలు, డబ్బును అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానుఅని సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.

Dharmapuri-Sanjay.jpg

డర్టీ పాలిటిక్స్..!

ఎంపీ అరవింద్ (MP Dharmapuri Arvind) దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎంపీ అర్వింద్.. నీ అంతం మొదలైంది. మా నాన్నకు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారు. మా నాన్న ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) ఆదేశిస్తే అర్వింద్‌పై పోటీచేస్తాను. మా నాన్నను బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేయిస్తున్న డర్టీ పాలిటిక్స్. మానాన్న డీఎస్‌కు ప్రాణహాని ఉంది. అర్వింద్‌కు కొందరు సహకరిస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు. వాళ్లు పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. అర్వింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందిఅని సోదరుడ్ని సంజయ్ హెచ్చరించారు.

DS-and-Sanjay.jpg

ఇందుకే డీఎస్ రాజీనామా..!

అయితే తనకు ఆరోగ్యం సహకరించట్లేదని.. అందుకే క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు డీఎస్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని కూడా డీఎస్ రాసకొచ్చారు.ఈ నెల 26న నా కుమారుడు ధర్మపురి సంజయ్ (D Sanjay) కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరిన సందర్భంగా, ఆశీస్సులు అందజేయడానికి గాంధీ భవన్‌కు వెళ్లిన నాకు కండువా కప్పి, నేను కూడా మళ్లీ పార్టీలో చేరినట్లుగా మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. నేను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినే కానీ, ప్రస్తుతం నా వయస్సు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. పార్టీలో నా చేరికకూ, నా కుమారుడు సంజయ్ టికెట్‌కు ముడిపెట్టడం భావ్యం కాదు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు, సంప్రదాయాలు, ప్రజామోదం మేరకే పార్టీ టికెట్ల కేటాయింపు జరుగుతుందన్న విషయం మనకు తెలియనిది కాదు. ఆరోగ్య రీత్యా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న వివాదాల్లోకి లాగొద్దని విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీలో నేను మళ్లీ చేరానని భావిస్తే ఈ లేఖను నా రాజీనామాగా భావించి, ఆమోదించవల్సిందిగా కోరుకుంటున్నాను అని డీఎస్ లేఖలో చెప్పుకొచ్చారు.

DS-Congress.jpg

మొత్తానికి చూస్తే.. డీఎస్ కుమారులు ధర్మపురి అర్వింద్, సంజయ్ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడరన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సందర్భాల్లో డీఎస్ ఇంటి పంచాయితీ బయటికి రాగా.. తాజాగా డీఎస్ రాజీనామాతో మరోసారి రచ్చ రచ్చ అయ్యింది. డీఎస్ రాజీనామా వెనుక తన సోదరుడు, ఎంపీ అర్వింద్ హస్తం ఉందని సంజయ్ పదే పదే చెబుతున్నారు. రాజీనామా ఒక్కటే కాదు.. ఆస్తులు కూడా రాయించుకున్నారని సంచలన ఆరోపణలే చేశారాయన. అయితే ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకూ అర్వింద్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఎంపీ రియాక్ట్ అయితే గానీ అసలేం జరిగిందో.. ఈ ఆరోపణల్లో ఎంత నిజముందో తెలిసే పరిస్థితుల్లేవ్.

******************************

ఇవి కూడా చదవండి

******************************

TS Congress : నిన్న కాంగ్రెస్‌లో చేరిక.. ఇవాళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్.. సడన్‌గా ఎందుకిలా..!?


******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?


******************************

Updated Date - 2023-03-27T18:38:26+05:30 IST