Share News

AP Capitals : రాజధాని తరలింపుపై నాలుక మడతేసిన సీఎస్!

ABN , First Publish Date - 2023-10-25T21:49:59+05:30 IST

అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్‌క్ పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది..

AP Capitals : రాజధాని తరలింపుపై నాలుక మడతేసిన సీఎస్!

అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్‌కు పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో బ్యానర్ ఐటమ్‌లు, ఏబీఎన్ టీవీ చానెల్‌లో బిగ్ స్టోరీలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. విశాఖకు రాజధాని తరలింపు అనేది అంతా ఉత్తుత్తే అని ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు జరగడం లేదని విశాఖ జిల్లా అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించి బుట్టలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ (CM YS Jagan), అధికార పార్టీ నాయకులు కలిసి నాటకమాడుతున్నారని మరోవైపు రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) మీడియా ముందుకొచ్చి పెదవి విప్పారు. అయితే ఆయన కూడా నాలుక మడతేసి మాట్లాడేశారు.. దీంతో అసలు రాజధాని తరలింపు ఉందా..? లేకుంటే సీఎం క్యాంప్ ఆఫీసు మాత్రమేనా అని ప్రభుత్వాధికారులకు.. సొంత పార్టీ నేతలకు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నేతలకు అర్థం తలలు పట్టుకుంటున్న పరిస్థితి.


CS-Jawahar.jpg

సీఎస్ ఏమన్నారు..?

విశాఖలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధ్యక్షతన తీర భద్రత అంశంపై సమీక్ష జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సముద్రం వెంబడి 12 నాటికా మైళ్ళు దాటి ప్రయాణం చేసే నౌకల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తీర భద్రత గురించి మాట్లాడిన ఆయన.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రత్యేక సందర్భాల్లో నౌకల రాకపోకలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సమీక్షలో సీఎస్ చర్చించారు. ఈ సందర్భంగా.. రాజధాని తరలింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు అని ఎవరూ చెప్పలేదు కదా?. మేము ఇచ్చిన జీవోలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడాం. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక కమిటీ ని వేశాం.. కమిటీ నివేదిక రావాల్సి ఉంది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి అని సీఎస్ చెప్పుకొచ్చారు.

AP-Three-Capitals.jpg

అబ్బే అంతా తూచ్..!

ఏ రాజధానీ విశాఖకు రావడం లేదని.. అయితే సీఎం జగన్‌ మాత్రం తనకు వీలు చిక్కినప్పుడు విశాఖ వచ్చి క్యాంపు చేస్తారని.. ఒకట్రెండు రోజులు ఇక్కడ ఉంటారని అధికారులు చెబుతున్న పరిస్థితి. ఆ సమయంలో ఉత్తరాంధ్ర సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తారని.. అందుకోసం కీలకమైన శాఖల ఉన్నతాధికారులు ఆయన వెంట వస్తారని.. వారికి మాత్రమే ప్రస్తుతం విశాఖలో తాత్కాలిక బస ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. కమిషనర్లు, కార్యదర్శులతో పాటు వారి పీఏలు వస్తారు. వారికి బంగళాలు.. లేదంటే ఫ్లాట్లు ఉంటే సరిపోతుందని భావిస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. జిల్లాలోని ఏ శాఖకూ ఇప్పటివరకు అమరావతి నుంచి కార్యాలయాల తరలింపు లేదా ఏర్పాటుకు సంబంధించి ఒక్క ఆదేశమూ రాలేదు. దాంతో విశాఖ అధికారులంతా ఎలాంటి చింతా లేకుండా నిబ్బరంగా ఉన్నారు.

Vizag-CM-Camp-Office.jpg

త్రిసభ్య కమిటీ నివేదిక కోసమే

సీఎం విశాఖ క్యాంపు చేయడానికి వస్తే ఆయనతో పాటు వచ్చేవారు ఉండడానికి ఎక్కడెక్కడ భవనాలు ఉన్నాయో చూసేందుకే త్రిసభ్య కమిటీని నియమించారు. సదరు కమిటీ గత సోమవారం విశాఖలో జిల్లా అధికారులను పిలిచి వివరాలు అడిగింది. ఆయా శాఖలకు ఉన్న భవనాలు, భూముల గురించి ఆరా తీసింది. వారు చెప్పినవి రాసుకుంది. విశాఖలో వివిధ శాఖలు తమ అవసరాల కోసం ఎప్పుడో నిర్మించుకున్న భవనాలను రాజధాని పేరుతో నాలుగేళ్లుగా ఖాళీగా ఉంచారు. వాటిని ఇప్పుడు జాబితాలో చేర్చి.. అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వానికి కమిటీ నివేదించినట్లు తెలిసింది. రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌-ఏ, టవర్‌-బీ, వీఎంఆర్‌డీఏ వాణిజ్య సముదాయాలు ఖాళీగా ఉన్నట్లు చూపించింది. చూశారు కదా.. అటు అధికారులు మాటలకు.. ఇటు వైసీపీ నేతల మాటలకు ఏమైనా ఇసుమంతైనా సంబంధముందా..? అసలేం జరుగుతోందో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

AP-Capital.jpg

TS Elections : రాజీనామా చేశాక రేవంత్‌పై రాజగోపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు


Updated Date - 2023-10-25T21:50:30+05:30 IST