Nagula Chavithi : భక్తి శ్రద్ధలతో నాగులచవితి
ABN, First Publish Date - 2023-11-17T13:12:49+05:30 IST
దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధి రోజున...

దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధి రోజున నాగుల చవితి పండుగ చేసుకుంటారు.

నాగుల చవితి పండుగ రోజున పుట్టలో పాలు పోయడం భారత దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం.

గుళ్ళలో ఉన్న పుట్టలలో గానీ లేదా ఊరి బయట ఉన్న పుట్టలలో భక్తులు పాలు పోస్తారు.

చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వ రోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

నాగుల చవితినాడు నాగేంద్రుడు శివునికి వాసుకిగా, విష్ణువుకు ఆదిశేషుడుగా తోడు ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి.

ఎవరైనా కోడిగుడ్డు వేయాలనుకునేవారు పుట్ట రంధ్రాల్లో వేయకూడదు. పుట్టపై ఉంచాలి..
Updated at - 2023-11-17T13:23:10+05:30