America : కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు...ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2023-01-24T08:08:59+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది....

America : కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు...ఏడుగురి మృతి
shooting in California

వరుస కాల్పుల ఘటనలతో దద్దరిల్లిన అమెరికా

కాలిఫోర్నియా (యూఎస్): అమెరికాలోని కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల ఘటన కలకలం రేపింది.(California) అమెరికాలోని కాలిఫోర్నియాలోని హాఫ్ మూన్ బే నగరంలో మంగళవారం ఓ దుండగుడు ఏడుగురిని కాల్చిచంపాడు.(Seven dead)నిన్న చికాగోలో జరిగిన కాల్పుల్లో(Shooting) ఓ తెలుగు విద్యార్థి మృత్యువాత పడ్డారు.

అమెరికాలో వరుస కాల్పులు

అమెరికాలో వరుసగా మూడు కాల్పుల ఘటనలు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు తమ కస్టడీలో(Gunman in custody) ఉన్నాడని శాన్ మాటియో కౌంటీ ఒక ట్వీట్‌లో పేర్కొంది.(San Mateo County tweet)కాలిఫోర్నియాలోని మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ న్యూ ఇయర్ ఈవెంట్‌లో 72 ఏళ్ల వ్యక్తి 10 మందిని చంపిన ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. పోలీసులు నిందితుడు ఉన్న వ్యాన్‌ వద్దకు వెళ్లేసరికి తుపాకీ శబ్దం వినిపించింది.

చికాగోలో కాల్పుల కలకలం.. తెలుగు విద్యార్థి దుర్మరణం..

అమెరికాలోని చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు తెలుగు విద్యార్థుల్లో ఒకరు దుర్మణం చెందారు. విజయవాడకు చెందిన దేవాన్ష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయాల కారణంగా మరణించారు. హైదరాబాదీ విద్యార్థి సాయిచరణ్ పరిస్థితి కాస్త నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.

చరణ్, దేవాన్ష్‌లు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా నల్లజాతికి చెందిన కొందరు కారులో వచ్చి వారిని అడ్డగించారు. వారి వద్ద ఉన్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఈ క్రమంలో యువకులు భయభ్రాంతులకు లోనై తప్పించుకునేందుకు యత్నించగా నిందితులు వారిపై కాల్పులు జరిపారు. చరణ్‌కి ఛాతీలో, దేవాన్ష్‌కు భుజం, వెన్నులోకి బుల్లెట్స్ దూసుకుపోయాయి.

Updated Date - 2023-01-25T08:04:17+05:30 IST