US Box Office: అమెరికాలో వీరయ్య, వీరసింహా వసూళ్లలో వీర కుమ్ముడు..!

ABN , First Publish Date - 2023-01-15T10:44:52+05:30 IST

సంక్రాంతి సందర్భంగా విడుదలైన బాలయ్య 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy), మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) రెండూ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.

US Box Office: అమెరికాలో వీరయ్య, వీరసింహా వసూళ్లలో వీర కుమ్ముడు..!

ఓవర్సీస్ సినిమా: సంక్రాంతి సందర్భంగా విడుదలైన బాలయ్య 'వీర సింహారెడ్డి' (Veera Simha Reddy), మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) రెండూ మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్నాయి. అటు ఓవర్సీస్‌లో (Oversease) కూడా ఈ రెండు సినిమాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ప్రధానంగా యూఎస్‌ బాక్సాఫీస్ (US Boxoffice) వద్ద వీరయ్య, వీరసింహా కనకవర్షం కురిపిస్తున్నాయి. వీరయ్య అయితే విడుదలైన రెండు రోజుల్లోనే మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటేసింది. ఇప్పటికే 1.3మిలియన్ డాలర్లు (10.56కోట్లు) రాబట్టింది. అలాగే వీర సింహారెడ్డి కూడా మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఈ మేరకు ఈ రెండు సినిమాలను అమెరికాలో విడుదల చేసిన శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ (Shloka Entertainments) తాజాగా ట్వీట్ (Tweet) చేసింది. వీకెండ్లకు తోడు పండగపూట కావడంతో ఇవి రెండు కలెక్షన్ల పరంగా ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి.

Updated Date - 2023-01-15T11:06:31+05:30 IST