NRI: భార్య అసహజ శృంగారానికి నిరాకరించిందని.. ఎన్నారై భర్త ఎంతకు తెగించాడంటే..!

ABN , First Publish Date - 2023-01-19T11:41:43+05:30 IST

వారిద్దరూ ప్రేమించుకుని, కొంత కాలం లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి మరీ పెళ్లి చేసుకున్నారు.

NRI: భార్య అసహజ శృంగారానికి నిరాకరించిందని.. ఎన్నారై భర్త ఎంతకు తెగించాడంటే..!

అహ్మదాబాద్: వారిద్దరూ ప్రేమించుకుని, కొంత కాలం లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి మరీ పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహమైన తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. భార్యను తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. దానికి నిరాకరించడంతో ఆమెను విడిచిపెట్టాడు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు(Ahmedabad) చెందిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2016 అక్టోబర్ 24న బెంగళూరులోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా బాధితురాలికి, ఆమె భర్తకు పరిచయం ఏర్పడింది. ఆ తరువాత తమ నంబర్లు ఒకరికొకరు మార్చుకుని స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా కొంతకాలానికి ప్రేమగా మారింది. చివరికి డేటింగ్ మొదలుపెట్టి దాదాపు రెండేళ్ల పాటు సహాజీవనం చేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో వారు పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.

ఇక వివాహమైన తర్వాత అత్తమామలు తన రూపాన్ని బట్టి తిట్టడం, వెక్కిరించడం, వేధించడం మొదలుపెట్టారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అదే సమయంలో తన భర్త తనతో అసహజ శృంగారానికి ప్రయత్నించాడని, దానికి తాను నిరాకరించిన ప్రతిసారి తనకు విడాకులు ఇస్తానని బెదిరించాడని ఆమె తన ఫిర్యాదులో నివేదించింది. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు ఈ జంట మకాం మార్చింది. అక్కడికి వెళ్లిన తర్వాత కొన్ని రోజులు భర్త బాగానే ఉన్నాడు. మూడు నెలల తర్వాత మళ్లీ అసహజ శృంగారానికి భర్త పట్టుబట్టాడు. కానీ ఆమె దానికి ఒప్పుకోలేదు.

దీంతో భర్త కోపంతో తనను చితకబాదాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనను వదిలేసి స్పాన్సర్‌షిప్‌ను ఉపసంహరించుకున్నాడని తెలిపింది. అనంతరం 2022 జూలై 30న ఆమెకు భర్త విడాకుల నోటీసు పంపాడు. కాగా, ఆమె భారత రాయబార కార్యాలయం సహాయంతో గుజరాత్‌కు తిరిగి వచ్చింది. స్వస్థలం అహ్మదాబాద్‌కు వచ్చిన తర్వాత ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. కూతురు బాధ చూడలేక ఆమె తల్లిదండ్రులు భర్తపై ఫిర్యాదు చేయించారు. భర్త తనపై గృహహింసకు పాల్పడ్డాడని, అసహజ శృంగారానికి నిరాకరించడంతో తనకు విడాకులు అడుగుతున్నాడని ఆమె శాటిలైట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త గృహహింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-01-19T11:41:45+05:30 IST